Independence 2023: సందర్భంగా నోకియా కంపెనీ భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

ఇండిపెండెన్స్ డే 2023 సందర్భంగా నోకియా కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్

Nokia T21 పైన భారీ కూపన్ అఫర్

ఇండిపెండెన్స్ 2023 సందర్భాన్ని గొప్ప డిస్కౌంట్ కూపన్ అఫర్ తో Nokia పురస్కరిస్తోంది

Independence 2023: సందర్భంగా నోకియా కంపెనీ భారీ డిస్కౌంట్

ఇండిపెండెన్స్ డే 2023 సందర్భంగా నోకియా కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఇండియాలో నోకియా సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ ట్యాబ్లెట్ Nokia T21 పైన భారీ కూపన్ ను అఫర్ చేస్తోంది. ఇండిపెండెన్స్ 2023 సందర్భాన్ని గొప్ప డిస్కౌంట్ కూపన్ అఫర్ తో పురస్కరిస్తోంది నోకియా. ఈ అఫర్ తో మీరు నోకియా లేటెస్ట్ ట్యాబ్లేట్ Nokia T21 ను రూ. 3,000 ను డిస్కౌంట్ తో చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. మరి నోకియా ఆఫర్ చేస్తున్న ఆ ఇండిపెండెన్స్ డే 2023 అఫర్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇండిపెండెన్స్ డే 2023 అఫర్ 

నోకియా లేటెస్ట్ ట్యాబ్లేట్ Nokia T21 ధర రూ.17,999 గా ఉండగా Nokia అధికారిక వెబ్సైట్ నుండి FREEDOM3000 కోడ్ ను ఉపయోగించి ఈ ట్యాబ్లేట్ ను కొనేవారికి రూ. 3,000 భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే, ఈ ఇండిపెండెన్స్ అఫర్ ద్వారా ఈ Nokia T21 ట్యాబ్లేట్ ను రూ. 14,999 రూపాయలకే పొందే వీలుంది. అయితే, ఈ అఫర్ లిమిటెడ్ పిరియడ్ అఫర్ మాత్రమే అని గుర్తుంచుకోండి. 

Nokia T21 (WiFi+4G): స్పెక్స్ 

ఈ నోకియా ట్యాబ్లేట్ 10.36 ఇంచ్ బిగ్ డిస్ప్లేని 2K (1200 x 2000) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గట్టి గ్లాస్ మరియు SGS Low Blue Light సర్టిఫికేషన్ తో వస్తుంది. అంతేకాదు, ఈ నోకియా ట్యాబ్లేట్ Netflix HD కోసం Widevine L1 సర్టిఫికేషన్ ను కూడా కలిగి వుంది. అంటే, ఈ ట్యాబ్లేట్ లో కంటెంట్ ను అద్భుతమైన క్వాలిటీతో ఆస్వాదించవచ్చు. 

ఈ నోకియా ట్యాబ్లేట్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ మెమోరిని కలిగి ఉంటుంది. ఇది మీ మల్టీ టాస్కింగ్, బ్రౌజింగ్, OTT కంటెంట్, షోషల్ మీడియా మరియు ఒక మోస్తరు గేమింగ్ అవసరాలకు సరిపోతుంది. ఈ ట్యాబ్లేట్ Android 12 OS పైన పనిహసిస్తుంది మరియు 2 మేజర్ OS అప్డేట్ లను అందుకుంటుంది. 

ఈ నోకియా ట్యాబ్లేట్ WiFi+4G సపోర్ట్ తో వస్తుంది కాబట్టి, వాయిస్ కాలింగ్, SMS లను కూడా అందుకోవచ్చు. ఈ ట్యాబ్లేట్ 8200 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. 

కెమేరాల పరంగా, ఈ Nokia T21 ట్యాబ్లేట్ ముందు 8 MP సెల్ఫీ కెమేరాని వెనుక 8 MP (AF)  మెయిన్ కెమేరాని కలిగి ఉంటుంది. ఆడియో పరంగా, OZO Spatial Audio రికార్డింగ్ మరియు ప్లే బ్యాక్ ఫీచర్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo