నోకియా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ జూన్ 4 న విడుదలకానుంది

నోకియా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ జూన్ 4 న విడుదలకానుంది
HIGHLIGHTS

JBL నుండి సౌండ్ మరియు ప్రత్యేకమైన లుక్ స్టాండ్

ఈ నోకియా స్మార్ట్ టీవీ ఆడియో 24W సౌండ్ అవుట్‌పుట్‌తో JBL సిగ్నేచర్ సౌండ్ తో రావచ్చు.

నోకియా కొంతకాలంగా తన 43 అంగుళాల టీవీని గురించి టీజ్ చేస్తోంది. అయితే, ఎట్టకేలకు ఈ టీవీని జూన్ 4 న ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ టీవీ యొక్క ఖచ్చితమైన ధర తెలియదు కాని దీని ధర రూ .31,000 మరియు 34,000 మధ్య ఉంటుందని అంచనా మరియు Dolby Vision వంటి ఫీచర్లను తీసుకువస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, Kodak నుండి  43-అంగుళాల టీవీ, 43CA2022 ధర 23,999 రూపాయలు మరియు ఆ టీవీ కూడా డాల్బీ విజన్ను తెస్తుంది. నోకియా 43-అంగుళాల టీవీకి తిరిగి వస్తున్నప్పుడు, దాని 55-అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంటే, దీనిలో కూడా JBL  నుండి సౌండ్  మరియు ప్రత్యేకమైన లుక్ స్టాండ్ ఉండవచ్చు.

నోకియా 43-అంగుళాల టీవీ : ప్రత్యేకతలు 

నోకియా 43-అంగుళాల టీవీ ముందుగా వచ్చిన పెద్ద TV  నుండి చాలా ఫీచర్లను పొందనుంది. ఈ టీవీ కూడా JBL ఆడియోతో వస్తుందని భావిస్తున్నారు. ఈ టీవీ 4 K టీవీ అవుతుందా అనేది ఇంకా ధృవీకరించబడలేదు కాని ఇది HDR ‌తో పాటు Dolby Vision కు కూడా మద్దతు ఇస్తుందని అంచనావేస్తున్నారు. ఈ టీవీ బాక్స్ నుండి బయటికి వస్తూనే ఆండ్రాయిడ్ టీవీలో నడుస్తుందని చెప్పబడింది. అందువల్ల, అన్ని ప్రసిద్ధ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ తో  పాటు Play Store కూడా ఉంటుందని మనం ఆశించవచ్చు. 55 అంగుళాల నోకియా టీవీలో 10-బిట్ ADS ప్యానెల్ ఉంది, ఇందులో 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది 10-బిట్ కలర్ స్పేస్‌లో 85-90% ని కవర్ చేస్తుంది. 43 అంగుళాల టీవీ కూడా దీనికి మద్దతు ఇస్తుందని మేము ఆశిస్తున్నాము.

ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ నోకియా స్మార్ట్ టీవీ ఆడియో 24W సౌండ్ అవుట్‌పుట్‌తో JBL సిగ్నేచర్ సౌండ్ తో రావచ్చు. సౌండ్ ట్యూనింగ్ మరియు ఈక్వలైజర్ JBL  నుండి అందించబడతాయి. ఈ టీవీలో రెండు పూర్తి-శ్రేణి డ్రైవర్లు ఉన్నారు, ఫ్రంట్ ఫేసింగ్ ట్వీటర్లు మరియు డౌన్-ఫైరింగ్ మిడ్ మరియు లోయర్ రేంజ్ డ్రైవర్లు. ప్రత్యేక వూఫర్ మాత్రం లేదు. ర్ టీవీ Dolby Audio మరియు DTS-True Surround సౌండ్ కు కూడా మద్దతు ఇస్తుంది. 55 అంగుళాల నోకియా స్మార్ట్ టివి క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 2.25 జిబి ర్యామ్ మరియు 16 జిబి స్టోరేజ్‌తో నడుస్తుంది మరియు 43 అంగుళాల టివికి కూడా ఒకే స్పెక్స్ ఉండే అవకాశం ఉంది.

Note :Image is 55 inch nokia tv

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo