Whatsapp లో కొత్త బగ్ : గ్రూప్ లో ఉన్న అందరి అకౌంట్ ప్రశ్నర్ధకంగా మారుతుంది.

Updated on 18-Dec-2019
HIGHLIGHTS

ఆ గ్రూప్ లోని అందరి అకౌంట్లను వాట్స్ ఆప్ నిలిపివేసే ప్రమాదం పొంచి ఉంటుంది.

చాటింగ్ కోసం అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి యాప్ అని చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది, Whatsapp అంటే అందులో ఎటువంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, ప్రస్తుతం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ మరియు కొత్త ఫీచర్లతో మరింత ట్రెండీ మరియు సెక్యూర్ గా ఉంటోంది. అయితే, ఒక కొత్త బగ్ ని వాట్స్ ఆప్ లో కనుగొన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ యొక్క సెక్యూరిటీ పరిశోధకుల చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందుగా live Mint తెలియచేసింది.

 live Mint ప్రకారం, ఈ బగ్ ఒక హానికర లేదా అభ్యంతరకరమైన మెసేజీని మీ వాట్స్ ఆప్ గ్రూప్ చాటింగ్స్ లోకి పంపుంతుంది. వాస్తవానికి, హానికర లేదా అభ్యంతరకరమైన మెసేజిలను పంపే గ్రూప్ లేదా అకౌంట్ హోల్డర్ యొక్క అకౌంట్ ను నిలిపివేసేలా ముందు నుండే వాట్స్ ఆప్ తెలిపింది. కాబట్టి, ఇటువంటి మెసేజిలు తమ గ్రూప్ చాటింగ్ లో చేరడం ద్వారా ఆ గ్రూప్ లోని అందరి అకౌంట్లను వాట్స్ ఆప్ నిలిపివేసే ప్రమాదం పొంచి ఉంటుంది.

అయితే, దీని నుండి తప్పించుకోవడానికి ఆ గ్రూప్ లోని సభ్యులందరూ కూడా తమ వాట్స్ ఆప్ ని డిలీట్ చేసి మరల తిరిగి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కానీ, తిరిగి ఇన్స్టాల్ చేసినా కూడా గ్రూప్ తిరిగి క్రియేట్ చేయాల్సివుంటుంది మరియు వారి ముందస్తు చాటింగ్ మొత్తం కూడా పర్మినెంటుగా డిలీట్ చేయబడుతుంది. అందుకోసమే, దీన్ని గుర్తించిన వాట్స్ ఆప్ ఈ బగ్ ని ఫిక్స్ చేసింది. దీన్ని నిర్వీర్యం చెయ్యడానికి వాట్స్ ఆప్ 2.19.58  నంబరుతో కొత్త వెర్షన్ న్ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ను అప్డేట్ చెయ్యడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతోంది.                                              

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :