ప్రపంచం ఇప్పటికి కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూనే వుంది. అందుకే, శాస్త్రవేత్తలు కోవిడ్-19ని సులభంగా గుర్తించడంలో సహాయపడే ఒక టెస్ట్ ను అభివృద్ధి చేశారు. ఇది ఒక విధమైన బ్రీత్‌లైజర్ మరియు దీన్ని Bubbler అని పిలుస్తున్నారు. ఈ కొత్త పద్దతిని బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తీసుకొచ్చారు. దీనితో చాలా సులభంగా కోవిడ్-19 ని గుర్తించవచ్చని ఈ పరిశోధకులు వివరించారు.
ఈ బ్రీత్‌లైజర్ ను రోగులు దాదాపు 15 సెకన్ల పాటు ట్యూబ్‌లోకి ఊదవలసి ఉంటుంది. తరువాత, ఎంజైమ్స్ కలయిక రివర్స్ RNA ను DNA లోకి ట్రాన్స్‌క్రైబ్ చేస్తుంది. దీని వలన ఆరోగ్య సంరక్షణ కార్మికులు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడం చాలా సులభం అవుతుంది. ప్రస్తుతం ప్రామాణికంగా సాగుతున్న నాసికా రంద్రాల ద్వారా చేసే టెస్ట్ అసౌకర్యవంతంగా ఉన్నా కూడా మరొక మార్గం లేక పోవడంతో దాన్నే ఆచరించవలసి వస్తోంది.
అయితే, ఈ బ్రీత్‌లైజర్ టెస్ట్ మాత్రం ఎటువంటి నాసికా రంద్ర క్లీనింగ్ అవసరం లేకుండా రోగి యొక్క శ్వాస ద్వారా వైరల్ కణాలను కొలుస్తుంది. వాస్తవానికి, కోవిడ్-19 సాధారణంగా వాయుమార్గం ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి, రోగి శ్వాసలోని కణాలను కొలవడం కూడా మరింత అర్థవంతంగా ఉంటుంది. అంతేకాదు, ఈ టెస్ట్ ద్వారా శ్వాసకోశ సమస్యలపై మరింత సమాచారం కూడా అందించవచ్చని కూడా పరిశోధకులు తెలిపారు.
ఈ టెస్ట్ కనుక మాస్ మార్కెట్‌కి చేరుకుంటే, ఎయిర్ పోర్ట్‌లు మరియు వందల కొద్దీ ప్రజలు గుమిగూడే ఇతర ప్రాంతాలలో దీనిని సులభంగా ఉపయోగించడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి, ఈ కొత్త పరీక్ష గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పటి వరకూ ఇది రియల్ మార్కెట్ ని చేరుకుంటుందో వేచిచూడాలి. కానీ, ఇలాంటి కొత్త ఆవిష్కరణలు మనల్ని ప్రకాశవంతమైన, వైరస్ రహిత భవిష్యత్తులోకి నడిపించగలవు.