పేటియం మాల్ నుండి కనీ విని ఎరుగని కళ్ళుచెదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఇదేదో ఒక ప్రోడక్ట్ కోసం చేసే ప్రకటన అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే, ప్రతి ప్రోడక్ట్ కేటగిరిలో దాదాపుగా ప్రతీఒక్క ఐటమ్ పైనా కూడా క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో కొన్ని ఆఫర్లను చూస్తుంటే మతిపోయినంత పనైపోయింది. ఎందుకంటే, ఆ ప్రోడక్ట్ ధర ఎంత ఉంటుందో అంతే మొత్తంను క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి అందిస్తుంది.
వినడానికి నమ్మశక్యంగా లేకున్నా మీరు వింటున్నది నిజం. హెడ్ ఫోన్లు, స్పీకర్లు, బట్టలు, స్మార్ట్ ఫోన్లు, హోమ్ థియేటర్లు, ఇలా ఒకటేమిటి పేటియం మాల్ నుండి అన్ని ప్రొడక్టుల పైనా కూడా క్యాష్ బ్యాక్ లతో వెల్లువెత్తింది. అలాగే, కొత్తగా శామ్సంగ్ నుండి వచ్చిన గెలాక్సీ S10 స్మార్ట్ ఫోన్ పైన అత్యధికంగా 14,000 రుపాయల క్యాష్ బ్యాక్ మరియు ఆపిల్ యొక్క అన్నీ ఫోన్ల పైన కూడా గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.
అయితే, ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ మీ పేటియం వాలెట్ లో జతచేయబడుతుంది. అంటే, మీరు ఏదైనా వస్తువులు కొనడానికి లేదా పేటియం చెల్లిపూలు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ ను మీ అకౌంటుకు ట్రాన్స్ఫర్ చెయ్యడానికి మాత్రం వీలుండదు. అయినా కూడా, ఈ క్యాష్ బ్యాక్ ద్వారా మీకు అనేక లాభాలను అందుకునే అవకాశాన్ని PAYTM అందిస్తుంది.