షావోమి నుండి రూ. 500 ధరకే మ్యాజిక్ లైట్ : మనిషి కదలికలను బట్టి వెలుగుతుంది

Updated on 24-Sep-2019
HIGHLIGHTS

ఈ లైట్ కి ఎటువంటి కరెంట్ సప్లై కూడా అవసరం లేదు.

షావోమి తన mi crowdfunding ద్వారా అనేకమైన ప్రొడక్టులను తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే. ముందుగా, చాల తక్కువ ధరకే ఒక స్మార్ట్ LED బల్బును తీసుకొచ్చిన mi సంస్థ, ఇప్పుడు  మరొక రకమైన కొత్త బల్బును తీసుకొచ్చింది. అదేమిటంటే, "Mi Motion-Activated Night Light 2" ఈ లైట్ నిజంగా ఒక మ్యాజిక్ లైట్ లాగా పనిచేస్తుంది. ఈ లైట్ ను మనకు అవసరమైన చోట ఉంచినట్లయితే, అది మనం దాని పరిసర ప్రాంతాల్లోకి రాగానే మన కదలికలను కనిపెట్టి, దానికి అనుగుణంగా వెలుగుతుంది.

నిజంగా వినడానికి ఆశ్చరంగా మరియు అద్భుతంగాను వుంది. అంతేకాదు, ఈ మి మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ ను కేవలం రూ. 500 రూపాయలకే తీసుకురావడం ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. ఈ లైట్ ను మీకు కావాల్సిన చోటా అనుసంధానం చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎటువంటి కరెంట్ సప్లై కూడా అవసరం లేదు. ఇది కేవలం మూడు AA బ్యాటరీలతో పనిచేస్తుంది.

ఇక దీని ప్రయోజనాల విషయానికి వస్తే, ఇది 120 డిగ్రీల మోషన్ సెన్సింగ్ తో వస్తుంది అదికూడా ఈ పరిధిలో మనిషి వచ్చినట్లైతే ఆటొమ్యాటిగ్గా వెలిగేలా ఉంటుంది. అలాగే, దీనిని మన అవసరానికి తగ్గట్టుగా రెండురకాలైన లైటింగ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. అలాగే. దీన్ని 360 డిగ్రీలు రొటేట్ చేసుకునేలా తీసుకొచ్చారు. అంటే, మనకు ఎటువైపుకు కావాలో, అటువైపునకు తిప్పుకోవచ్చన్నమాట. ఈ లైట్ షిప్పింగ్ రేపటి నుండి మొదలవుతుంది.                            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :