10 Minute Delivery: 10 నిమిషాల డెలివరీకి బ్రేకులు వేసిన కేంద్రం.!

Updated on 13-Jan-2026
HIGHLIGHTS

10 నిమిషాల డెలివరీకి బ్రేకులు వేసిన కేంద్రం

కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (Labour Ministry) రంగంలోకి దిగింది

గిగ్ వర్కర్లకు సరైన సామాజిక భద్రత లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నట్లు లేబర్ మినిస్ట్రీస్ గుర్తించింది

10 Minute Delivery: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్ సర్వీస్ లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో క్విక్ కామర్స్ యాప్స్ హవా మరింత ఎక్కువగా కొసాగుతోంది. కేవలం 10 నిమిషాల్లో మీరు కోరుకునే సామానులు మీ వద్దకు చేరుస్తామంటూ, Zepto, Blinkit, Zomato, Instamart మరియు Swiggy వంటి యాప్స్ యూజర్ల నుంచి మంచి ఆదరణ అందుకున్నాయి. అయితే, వస్తువులు లేదా ఫుడ్ ను చాలా తక్కువ సమయంలో అందించడానికి డెలివరీ వర్కర్స్ పడుతున్న ఇబ్బందులు మరియు ఇతర విషయాలు పరిశీలించిన కేంద్రం, 10 నిమిషాల డెలివరీకి బ్రేకులు వేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

10 Minute Delivery: ఎందుకు ఆగిపోతుంది?

ఇటీవలి కాలంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గి ఇంస్టామార్ట్ వంటి మరిన్ని క్విక్ కామర్స్ ప్లాట్‌ ఫామ్స్ “10 నిమిషాల్లో డెలివరీ” అనే ప్రామిస్ తో మార్కెట్‌ను బాగా ఆకర్షించాయి. కానీ, ఈ వేగవంతమైన డెలివరీ మోడల్ వల్ల డెలివరీ వర్కర్ లేదా డెలివరీ పార్ట్నర్ భద్రత మరియు వారి పని ఒత్తిడి పై ప్రశ్నలు పెరిగాయి. ఈ విషయాన్ని విన్నవిస్తూ ఇటీవల ధర్నాలు కూడా చేయడం జరిగింది. అందుకే, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (Labour Ministry) రంగంలోకి దిగింది.

Also Read: Bhogi 2026: 30 బెస్ట్ భోగి పండుగ 2026 శుభాకాంక్షలు మరియు ఇమేజస్ ప్రత్యేకంగా అందించాము.!

10 Minute Delivery: లేబర్ మినిస్ట్రీస్ జోక్యం ఏమి?

10 నిమిషాల డెలివరీ కోసం డెలివరీ పార్ట్‌నర్ల పై అనవసరమైన టైమ్ ప్రెషర్ పడుతున్నట్లు, లేబర్ మినిస్ట్రీస్ రిపోర్ట్ అందుకుంది. దీని కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉండటం మరియు గిగ్ వర్కర్లకు సరైన సామాజిక భద్రత లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నట్లు లేబర్ మినిస్ట్రీస్ గుర్తించింది.

ఈ “10 నిమిషాల డెలివరీ” అనేది మిస్‌ లీడింగ్ మార్కెటింగ్ అయ్యే అవకాశం ఎక్కుగా ఉంది. అందుకే,ఈ అంశాల పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం దీని కోసం స్పష్టమైన మార్పులు చేయాలని కంపెనీలను సూచించింది. ముఖ్యంగా, అన్ని కంపెనీలు కూడా 10 నిమిషాల డెలివరీ హామీ తొలగించాలని ఆదేశించింది.

మినిస్ట్రీ సూచనల తరువాత కొన్ని క్విక్ కామర్స్ కంపెనీలు తమ యాప్‌ అడ్వర్టైజ్‌మెంట్‌లలోని 10 నిమిషాల డెలివరీ తొలగించి దాని స్థానంలో “ఫాస్ట్ డెలివరీ” వంటి పదాలు వాడుతున్నట్లు చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :