Jio Phone Next Pre-Booking: వచ్చేవారం నుండి మొదలుకావచ్చు..బయటికి వచ్చిన ఇంట్రెస్టింగ్ రిపోర్ట్..!

Updated on 27-Aug-2021
HIGHLIGHTS

జియోఫోన్ నెక్స్ట్ యొక్క Pre-Bookings

JioPhone Next ధర కూడా ఆన్లైన్లో లీక్

రిలయన్స్ జియో నెక్స్ట్ ఫోన్ JioPhone Next

రిలయన్స్ జియో తన నెక్స్ట్ ఫోన్ గా JioPhone Next ను ప్రకటించిన విషయం మనకు తెలుసు. అయితే, ఈ ఫోన్ గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ మరింత ఆశక్తి రేపుతోంది. గూగుల్ మరియు జియో జతగా తీసుకొచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10 నుండి మార్కెట్లో అమ్మకాలను కొనసాగించనున్నదని చెబుతుండగా, వచ్చే వరం నుండి  జియోఫోన్ నెక్స్ట్ యొక్క Pre-Bookings మోదవుతాయని 91 మొబైల్స్ రిపోర్ట్ చెబుతోంది. కంపెనీ ఇప్పటికే తన రిటైల్ పాట్నర్స్ చర్చలు ప్రారంభించిందని మరియు కొద్దీ రోజుల్లోనే రిటైలర్లతో మరింత సమాచారాన్ని పంచుకుంటుందని తన నివేదిక పేర్కొంది.

ఇక గతంలో, ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ చేసిన ట్వీట్ ప్రకారం, JioPhone Next ధర రూ. 3,499 కావచ్చని చెబుతున్నారు, భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్ అమ్మకం సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. ముందుగా వచ్చిన లీక్స్ కూడా ఈ ఫోన్ రూ.3,500 నుండి రూ.4,500 మధ్యస్థంగా ఉండవచ్చని సూచించాయి. అయితే, ఈసారి మాత్రం క్లియర్ ప్రైస్ డిటైల్స్ ని లీక్స్ టిప్‌స్టర్ ద్వారా వెల్లడించినట్లు ఊహిస్తున్నారు.

JioPhone Next: స్పెక్స్

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ గురించి ఆన్లైన్లో వచ్చిన అనేకమైన లీక్స్ ద్వారా ఈ ఫోన్ 5.5-అంగుళాల HD డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు  Qualcomm QM215 చిప్‌సెట్‌తో రావచ్చు. అలాగే, ఈ ఫోన్ 2GB లేదా 3GB RAM తో రావచ్చు మరియు ఇది 16GB లేదా 32GB eMMC 4.5 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు ఈ JioPhone Next లో చేర్చబడ్డాయి. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది. జియోఫోన్ నెక్స్ట్ 13 MP స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుందని కూడా ఊహిస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :