జియో సంచలనం నిర్ణయం : కేవలం Rs .600 ధరకే అన్ని సర్వీసులు

Updated on 24-Apr-2019
HIGHLIGHTS

ల్యాండ్, బ్రాడ్ బ్యాండ్ మరియు TV సర్వీసులు కేవలం 600 రూపాయలకే

ఈ ఒక్క కనెక్షనుతో 40 వరకు స్మార్ట్ దివైజులకు కనెక్ట్ చేసుకునే సామర్ధ్యాన్ని కలిగివుంటుందని కూడా చెబుతోంది.

టెస్టింగ్ ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా 100Mbps వేగంతో 100GB డేటాని అందించినట్లు కూడా కొన్ని నివేదికలు వివరిస్తున్నాయి.

రోజు రోజుకు దూకుడు పెంచుతున్న రిలయన్స్ జియో, ఇప్పుడు కొత్తగా  సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముద్దుగా Live Mint అందించిన నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో గిగా ఫైబర్ తో పాటుగా, కేవలం 600 రూపాయలకే ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ మరియు TV వటు సర్విసులను అందించనున్నట్లు తెలియపరిచింది. అంతేకాదు, కేవలం ఈ ఒక్క కనెక్షనుతో 40 వరకు స్మార్ట్ దివైజులకు కనెక్ట్ చేసుకునే సామర్ధ్యాన్ని కలిగివుంటుందని కూడా చెబుతోంది.

ఈ సమాచారాన్ని గమనిస్తే, జియో ట్రిపుల్ ప్లే ప్లాన్ గురించి ముందుగా అంచనావేసినట్లుగా జరగనున్నట్లు అనిపిస్తోంది. అలాగే, ఈ కనెక్షన్ కోసం ముందుగా 4500 రూపాయల వన్ టైం డిపాజిట్ చెల్లిచేవిధంగా ఉండనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, ముందుగా బ్రాడ్ బ్యాండ్ సేవలు మాత్రమే అందుతాయి, మిగిలిన ల్యాండ్ లైన్ మరియు TV సేవలు రానున్న ఒక మూడు నెలల కాలం తరువాత జత చేయనుటలు అంచనా సమాచారం.

అయితే, ప్రసుతం చేస్తున్న టెస్టింగ్ ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా 100Mbps వేగంతో 100GB డేటాని అందించినట్లు కూడా కొన్ని నివేదికలు వివరిస్తున్నాయి. ఇవన్నీ కూడా నిజమైతే గనుక, తొందరలోనే ప్రతిఒక్కరికి అతితక్కవ ధరకే ఈ మూడు సేవలు అందుతాయి. జియో అత్యంత వేగవంతమైన ఆప్టికల్ ఫైబర్ సాంకేతికతతో ఈ FTTH సేవలనను చాల తక్కువ ధరకే అందుకోవచ్చు.                                               

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :