జియో గిగా ఫైబర్ Netflix ISP స్పీడ్ ఇండెక్స్ లిస్టులో అగ్ర స్థానంలో నిలిచింది

Updated on 16-Apr-2019

మార్చి నెలకు గాను ప్రకటించిన Netflix ISP స్పీడ్ ఇండెక్స్ లిస్టులో మరలా జిఓ గిగా ఫైబర్ అగ్రస్థానంలో నిలచింది. రియల్ HD కంటెంట్ వీడియోలకు వేదికనటువంటి Netflix యొక్క వీడియోలను వీక్షించడానికి వేగవంతమైన నెట్ కనెక్షన్ అవసరమవుతుంది. ఈ అవసరానికి తగిన స్పీడ్ అందిచే వాటిలో ఉత్తమమైన సర్వీస్ ప్రొవైడరుగా, జియో ఇప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

జియో గిగా ఫైబర్ రాకముందు వరకు ఈ విభాగంలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ప్రస్తుతం అన్నింటిని వేనుకకు నెట్టి జియో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ Netflix ISP స్పీడ్ ఇండెక్స్ లిస్టులో చూపిన వివరాల ప్రకారం, ఈ లిస్టులో 3.57 Mbps వేగంతో జియో మొదటి స్థానంలో ఉండగా, 7స్టార్ డిజిటల్ 3.40 Mbps వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. కేవలం చిన్నపాటి తేడాతో స్పెక్ట్రా నెట్ 3.39Mbps స్పీడుతో మూడవ స్థానాన్నికేకైవసం చేసుకుంది.

ఇక ఎయిర్టెల్ విషయానికి వస్తే, 3.31 Mbps వేగంతో నాలుగవ స్థానాల్లో నిలిచింది. మొదటి ఐదు స్థానాల్లో చివరిగా ATRIA కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ఐదవ స్థానాన్ని సాధించింది. అయితే, గత నెలతో పోలిస్తే అన్ని సంస్థల యొక్క వేగంలోకొంత తిరోగమనం కనిపించగా ఎయిర్టెల్ స్పీడులో మాత్రం పురోగమనం కనిపించడం విశేషంగా చెప్పొచ్చు.                                              

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :