JIO గిగా ఫైబర్ పేరుతొ స్కామర్ల వల : జాగ్రత్త

Updated on 02-Aug-2019
HIGHLIGHTS

ఈ రకమైన కొత్త స్కామ్ ఇప్పుడు మొదలయ్యింది.

ఈ నెలలో జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించవచ్చని వస్తున్నా అంచనాలను కొందరు స్కామర్లు సొమ్ముచేసుకోవాలని చూస్తున్నారు. మీకు ఈ మధ్యకాలంలో, జియో గిగా ఫైబర్ యాక్టివేషన్ రిక్వెస్ట్ పేరుతొ ఏమైనా మెయిల్ వచ్చిందా? అయితే దీన్ని అస్సలు నమ్మకండి. ఎందుకంటే, ఇటువంటి మెయిల్స్ జియో ఇంతవరకు ఎవరికి పంపలేదు. ఈ రకమైన కొత్త స్కామ్ ఇప్పుడు మొదలయ్యింది.

ఈ రకమైన వాటిని కనుగొన్నట్లు TOI ముందుగా నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం, గత సంవత్సరం జూలై నెలలో బీటా టెస్టింగ్ కోసం కొంత మంది వినియోగధారులకు ఈ సేవలను ఉచితంగా అందించింది. అది మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటుగా అతితక్కువ ధరకే అన్ని సర్వీసులను అందించనున్నదన్న సమాచారంతో, అందరి చూపు జియో గిగా ఫైబర్ పైన పడింది. అయితే, ఈ విషయాన్నే సొమ్ము చేసుకోవాలని కొందరు స్కామర్లు కొత్త స్కాములను తెరపైకి తీసుకువచ్చారు.

ముందుగా, అచ్చంగా జియో నుండి వచ్చినట్లు గా కనిపించేలా ఒక మెయిల్ ని తయారు చేసి కొంతమందికి ర్యాండంగా ( యాదృచ్చికంగా ) పంపిస్తారు. దీన్ని చూస్తే ఇది నిజమేనేమో అనిపించేలా చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఇది స్కామర్లు పంపించిన మెయిల్ . ఇందులో "జియో గిగా ఫైబర్ యాక్టివేషన్ రిక్వెస్ట్" అని ఉంటుంది. అంటే, ఈ జిఓ గిగా ఫైబర్ సేవలను యాక్టివేట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ అని ఈ మెయిల్ మీకు చెబుతుంది. ఒకవేళ మీరు నమ్మినట్లయితే, మీరు పూర్తిగా మోసపోతారు. మనకు తెలుసు జియో సేవలను పొందాలంటే 2,500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని అనేకరకాలుగా మోసం చేసే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :