ఇప్పటి వరకూ చాల తక్కువ సినిమాల ప్రదర్శనతో పేలేవంగా అనిపించిన, జియో సినిమా ఇక నుండి మీకు లెక్కలెన్నని సినిమాలను అందించనుంది. అయితే, ముందుగా సౌత్ ఇండియన్ సినిమా ప్రియుల కోసం SUN NXT తో భాగస్వామ్యం చేసుకోవడం వలన ఈ సంఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి, ఈ న్యూస్ అందించి అందరిని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసిందని చెప్పొచ్చు.
ఇక విషయానికి వస్తే, ఆన్-డిమాండ్ వీడియో ప్లాట్ ఫామ్ అయినటువంటి, జియో సినిమా మరోసారి తన వినియోగదారులకు మరొక మంచి కానుక అందించింది, ముఖ్యంగా సౌత్ ఇండియన్ మూవీ ప్రియుల కోసం ఈ కొత్త విషయాన్ని ప్రకటించింది. సన్ టివి నెట్‌వర్క్ నుండి ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ SUN NXT సహకారంతో, జియో సినిమా దేశవ్యాప్తంగా ఉన్న జియో వినియోగదారులకు దక్షిణ భారత చలన చిత్రాలలో ఉత్తమమైన వాటిని అందిస్తుంది.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలైన ర్ 4 దక్షిణ భారత భాషలలో SUN NXT ప్లాట్ ఫామ్‌లో అందుబాటులో ఉన్న అన్ని సినిమాలను కూడా ఇక నుండి జియో సినిమా ద్వారా అందిస్తుంది. SUN NXT యొక్క లైబ్రరీ నుండి 4,000 కి పైగా దక్షిణ భారత చలన చిత్రాల జాబితాకు ఇక నుండి జియో సినిమా అభిమానులకు కూడా యాక్సెస్ దొరుకుతుంది. అలాగే, వినియోగదారులు వారికీ కావలసిన లేదా నచ్చిన సినిమాలను, ప్రపంచ స్థాయి వీడియో స్ట్రీమింగ్ కోసం సెర్చ్ చెయ్యవచ్చు.
జియో వినియోగదారులకు జియో సినిమాకు ప్రత్యేకమైన యాక్సెస్ ఉంటుంది మరియు వారి అభిమాన తారలైన, తలైవర్ రజనీకాంత్, ఇలయతలపతి విజయ్, అల్లు అర్జున్, జూనియర్ NTR, తాలా అజిత్ కుమార్, మమ్ముట్టి, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ వంటి ఎందరో సినీతారల యొక్క సినిమాల కోసం జియో సినిమా యొక్క “సూపర్ సౌత్ స్వేగ్ ” లో భాగం కావచ్చు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ & మోలీవుడ్ నుండి సౌత్ స్టార్స్ యొక్క జాబితాను మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్‌లో నిరవధికంగా ఆస్వాదించవచ్చు.
JioCinema ఇప్పటికే 10,000+ సినిమాలు, 1 లక్ష + టీవీ షో ఎపిసోడ్లు & ఒరిజినల్స్ సహా విశాలమైన కంటెంట్‌ను కలిగి ఉంది. ఇప్పుడు, SUN NXT యొక్క సినిమాల జాబితాతో, అపరిమిత సౌత్ ఇండియన్ బ్లాక్ బస్టర్ లను ఆస్వాదించడానికి, ఇది నిజంగా వినియోగదారుల మొదటి ఎంపిక అవుతుంది.