TikTok Come Back: ఇండియాలో టిక్ టాక్ మళ్ళీ తిరిగొస్తోందా?

Updated on 22-Aug-2025
HIGHLIGHTS

షార్ట్ వీడియో యాప్ టిక్ టిక్ ఇండియాలో మళ్ళీ తిరిగొస్తోందా? అనే ప్రశ్న ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా చక్కర్లు కొడుతోంది

రీసెంట్ గా tiktok వెబ్సైట్ విండో కొంత మంది యూజర్లకు ఓపెన్ అవ్వడం తో ఈ కొత్త రూమర్ నెట్టింట్లో చర్చకు దారి తీసింది

టిక్ టాక్ ఇండియాలో రీ ఎంట్రీ’ కోసం కంపెనీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో? అనే ప్రశ్నలు తలెత్తాయి.

Tik Tok Come Back: దేశంలో అత్యధిక డౌన్ లోడ్స్ సాధించిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ ఇండియాలో మళ్ళీ తిరిగొస్తోందా? అనే ప్రశ్న ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ప్రశ్నలకు అఫీషియల్ గా ఎటువంటి సమాధానం లేదు. అంతేకాదు, ఈ విషయం గురించి ఎక్కడా పెద్దగా వార్తలు కూడా రాలేదు. కానీ, రీసెంట్ గా tiktok వెబ్సైట్ విండో కొంత మంది యూజర్లకు ఓపెన్ అవ్వడం తో ఈ కొత్త రూమర్ నెట్టింట్లో చర్చకు దారి తీసింది.

TikTok Come Back: ఇండియాలో టిక్ టాక్ తిరిగి వస్తుందా?

ఇండియాలో టిక్ టాక్ తిరిగి వస్తుందా? ఈ ప్రశ్నకు సింపుల్ సమాధానం ప్రస్తుతానికి ఈ విషయం పై ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. వాస్తవానికి, 2020 నుంచి ఈ యాప్ ఇండియాలో బ్యాన్ అయ్యింది మరియు ఇప్పుడు కూడా ఈ యాప్ పై భారత ప్రభుత్వం విధించిన బ్యాన్ కొనసాగుతోంది. నెట్టింట్లో ప్రస్తుతం నడుస్తున్న చర్చ నిరాధారమైన చర్చ అని బల్ల గుద్ది చెబుతున్నారు. కానీ, టిక్ టాక్ వెబ్సైట్ ఇప్పుడు ఇండియాలో కొంత మంది యూజర్లకు ఓపెన్ అవ్వడం వలన ‘ఏమో టిక్ టాక్ ఇండియాలో రీ ఎంట్రీ’ కోసం కంపెనీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో? అనే ప్రశ్నలు తలెత్తాయి.

TikTok ఇండియాలో ఎందుకు బ్యాన్ అయ్యింది?

భారతీయ యూజర్ల ప్రైవసీ డేటాను చైనాలో స్టోర్ చేస్తున్న కారణంగా ఈ యాప్ ఇండియాలో బ్యాన్ అయ్యింది. IT చట్టం, సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది.

టిక్ టాప్ ఎప్పుడు బ్యాన్ అయ్యింది?

ముందుగా, 2019 ఏప్రిల్ లో మద్రాస్ హైకోర్టు ఈ యాప్ పై స్తే విధించింది. ఈ షార్ట్ వీడియో యాప్ యొక్క పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత 2021 జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం (MeitY) ఈ యాప్ ను ఇండియాలో పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే, ఈ యాప్ ను ఇండియాలో తీసుకురావడానికి గతంలో లోకల్ పార్ట్నర్‌ షిప్ గురించి వార్తలు వచ్చినా, ఈ యాప్ రిటర్న్ పై గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో పూర్తిగా బ్యాన్ లోనే కొనసాగుతోంది.

Also Read: ఏపీకి BSNL కొత్త ఆఫర్: OTT, ఇంటర్నెట్ మరియు ఫోన్ సేవలతో కొత్త ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్.!

ఈ యాప్ వస్తున్న రూమర్స్ vs అసలు నిజం ఏమిటి?

ఈ యాప్ ఇండియా వెబ్ పేజ్ లో ఓపెన్ అవుతుందని చెప్పినా, ఇది బ్యాన్ ఎత్తివేసినట్లు కాదని గుర్తించాలి. ముఖ్యంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ యాప్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. కానీ, ఇండియాలో ఈ యాప్ ని తీసుకు రావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుందనే మాటలు కూడా కొట్టివేయడానికి లేదు.

ఇండియా రీ ఎంట్రీ కోసం టిక్ టాక్ ఏమి చేయాలి?

ఇండియా రీ ఎంట్రీ కోసం టిక్ టాక్ ముందుగా ముఖ్యంగా డేటా లోకలైజేషన్ మరియు సెక్యూరిటీ కంప్లయెన్స్ కోసం రెడీ అవ్వాలి. అలాగే, లోకల్ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి కన్నా మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, చట్టపరమైన అనుసరణ పూర్తి చేయాలి. అంటే, MeitY మార్గదర్శకాలు శిరసా వహించాలి. ఒకవేళ ఇవన్నీ ఫాలో అయితే టిక్ టాక్ ఇండియాలో రీ ఎంట్రీ కోసం అవకాశాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే, ఇండియన్ గవర్నమెంట్ లేదా బైట్ డాన్స్ నుంచి అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు మనం ఎటువంటి నిర్ధారణకు రాలేము. ఫ్యూచర్ లో ఈ యాప్ రీ ఎంట్రీ గురించి ఇప్పుడు మనం మాట్లాడటం అప్రస్తుతం అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :