రష్యాలో జరిగిన రోబోటిక్ కాంపిటీషనులో సత్తాచాటిన భారతీయ విద్యార్థులు.

Updated on 18-Jun-2019
HIGHLIGHTS

ఈ కాంపిటీషన్ లో ఇండియా మరియు రష్యాకి సంభంధించి దాదాపుగా 180 మంది కంటే పైచిలుకు విద్యార్థులతో కూడిన 50 టీములు పాల్గొన్నాయి.

జూన్ 16 వ తేదీన రష్యాలోని, మాస్కో లోని  'ది పీపుల్స్ ఫ్రెండ్ షిప్ యూనివర్సిటీ ఆఫ్ రష్యా' లేదా RUDN యూనివర్శటీలో మన ఆసియాలోనే అతిపెద్ద రోబోటిక్ కాంపిటీషన్ కు ఆతిధ్యమిచ్చింది. ఈ కాంపిటీషన్ లో ఇండియా మరియు రష్యాకి సంభంధించి దాదాపుగా 180 మంది కంటే పైచిలుకు విద్యార్థులతో కూడిన 50 టీములు పాల్గొన్నాయి.    

ఇందులో స్ప్రింగ్ డేల్స్ పూస రోడ్, వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్, స్కోటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్, వొరబాయవా గోరా, ఇంగ్లిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ మాస్కో మరియు కంప్యూటర్ అకాడమీ రుబికన్ వంటివి పాల్గొన్నాయి. అయితే, ఇందులోని విద్యార్థుల వయసుల కారణంగా, వారిని మూడు విభాగాలుగా విడగొట్టారు. ఇందులో, జూనియర్, మిడిల్ మరియు సీనియర్ గా విభజించారు.

ఈ కాంపిటీషన్ లో జరిగిన అన్ని విభాగాలలో ఇంటర్నేషనల్  స్టేజి పైన భారతీయ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. పూర్తిగా అన్ని విభగాలలోను భారతీయ విద్యార్థులు, విన్నర్లుగా నిలవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఇందులో జూనియర్ విభాగంలో స్ప్రింగ్ డేల్స్ , పూస రోడ్ విజయం సాధించగా, మిడిల్ మరియు సీనియర్ విభాగంలో వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్ విజయం సాధించింది.                               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :