Indian government banned 16 youtube channels which showing misinformation against india
Pahalgam attack యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో ఏకవురు పెడుతున్నా పాకిస్తాన్ మాత్రం ఇందులో తమ తప్పేమీ లేదని బూటకపు మాటలు చెబుతోంది. అయితే, ఇది చాలదన్నట్లు ఇప్పుడు ప్రముఖ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ మరో మెట్టు పైకెక్కి భారతదేశం పై పూర్తిగా విషం కక్కడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా, ఈ ఛానల్స్ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలా వీడియోలను పోస్ట్ చేస్తున్నాయి. అంతేకాదు, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అటువంటి అనైతిక ఛానల్స్ గుర్తించిన ఇండియన్ గవర్నమెంట్ 16 పాకిస్థాన్ ఛానల్స్ ను ఇండియాలో బ్యాన్ చేసింది.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ బైసారన్ వ్యాలీ లో జరిగిన ఉగ్రవాదుల దాడి కారణంగా ఇరు దేశాల మద్యం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఉగ్ర చర్య పాకిస్తాన్ కుట్రగా యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఏకవురు పెడుతోంది. ఈ పిరికిపంద చర్యకు దీటుగా సమాధానం ఇచ్చే దేశంగా భారత్ కఠిన చర్యలు తీసుకోవడానికి డి`సిద్ధమైన నేపథ్యంలో ప్రముఖ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ భారత్ పై తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టాయి.
ఇందులో పాకిస్తాన్ ప్రముఖ న్యూస్ ఛానల్స్ అయిన Geo News, SAMAA TV, ARY NEWS మరియు Dawn NEWS వంటి మరిన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందుకే, భారత్ పై తప్పుడు ప్రచారం మరియు దేశంలో మాట కలహాలు రేపే విధంగా వివాదాస్పద కంటెంట్ ను ప్రసారం చేస్తున్న 16 యూట్యూబ్ ఛానల్స్ ను భారత ప్రభుత్వం ఇండియాలో బ్యాన్ చేసింది. ఈ 16 యూట్యూబ్ ఛానల్స్ ఈ క్రింద చూడవచ్చు.
పైన తెలిపిన 16 ఛానల్స్ కూడా భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఆఫర్స్ ఈ ఛానల్స్ ఇండియాలో బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. ఈ 16 ఛానల్స్ కూడా ఇండియాలో ప్రసారం అవ్వవు. ఇది మాత్రమే కాదు పాకిస్తాన్ అధికారిక X అకౌంట్ ను కూడా ఇండియాలో బ్యాన్ చేసింది.
Also Read: Realme GT7 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!