Lunar Eclipse 2025: టెక్నాలజీతో ‘బ్లడ్ మూన్’ అందాలు చూడటానికి మీరు సిద్ధమా?

Updated on 07-Sep-2025
HIGHLIGHTS

ఈరోజు రాత్రి ఖగోళ అద్భుతం జరగనున్నది

ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం జరగనున్నది

ఈరోజు చంద్రగ్రహణం సమయంలో చందమామ పూర్తిగా ఎర్రగా రక్త వర్ణంలోకి మారిపోతుంది

Lunar Eclipse 2025 : ఈరోజు రాత్రి ఖగోళ అద్భుతం జరగనున్నది. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం జరగనున్నది. అయితే, ఈరోజు జరగనున్న సంపూర్ణ చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. అదేమిటంటే, ఈరోజు చంద్రగ్రహణం సమయంలో చందమామ పూర్తిగా ఎర్రగా రక్త వర్ణంలోకి మారిపోతుంది. దీన్నే ‘బ్లడ్ మూన్’ అని కూడా అంటారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా జరుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీతో బ్లడ్ మూన్ అందాలు మీరు నేరుగా చూడవచ్చు.

Lunar Eclipse 2025 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల 58 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. పాక్షిక గ్రహణం 9 గంటల 57 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, పూర్తి గ్రహణం రాత్రి 11:00 PM నుంచి సెప్టెంబర్ 8వ తేదీ 12:22 AM వరకు కొనసాగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11 గంటల 41 నిమిషాలు ఉచ్చస్థాయికి చేరుకుంటుంది. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 2 గంటల 25 నిమిషాలకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

Lunar Eclipse 2025 టెక్నాలజీ సహాయంతో ఎలా చూడొచ్చు?

నేటి డిజిటల్ యుగంలో ఈ ప్రక్రియను చూడటం చాలా సర్వసాధారణమైన విషయం అవుతుంది. దీనికోసం అనేక మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్ లో Sky Map లేదా Stellarium లేదా Star Walk 2 వంటి యాప్స్ లో ఈ ప్రక్రియ మొత్తని మీ బెడ్ రూమ్ లో కూర్చుని చూడొచ్చు. ఒక వేల మీరు నేరుగా లైవ్ చూడాలనుకుంటే ఫోటోగ్రఫీ టెక్నిక్ ఉపయోగించి చూడవచ్చు. దీనికోసం ట్రైపాడ్ పై DSLR లేదా Mirrorless కెమెరాలు ఉపయోగించి చూడొచ్చు.

లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా మీరు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు. ISRO మరియు NASA తో పాటు న్యూస్ ఛానల్ తో పాటు చాలా మంది యూట్యూబర్స్ వారి ఛానల్ నుంచి ఈ బ్లడ్ మూన్ అందాలు లైవ్ లో ప్రసారం చేసే అవకాశం ఉంది. మరింత గొప్ప విషయం ఏమిటంటే 2025 సంపూర్ణ చంద్రగ్రహణం భారత్ లో నేరుగా చూసే అవకాశం ఉంది. అంటే, ఈ ఎక్విప్మెంట్ అవసరం లేకుండా నేరుగా కూడా చూడవచ్చు.

Also Read: OnePlus Nord Buds 3r సేల్ రేపు స్టార్ట్ అవుతుంది: ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈరోజు జరిగే సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 82 నిముషాల పాటు కొనసాగుతుంది మరియు ఈ దశాబ్దంలో ఎక్కువ సేపు జరిగే సంపూర్ణ చంద్రగ్రణాలలో ఒకటిగా నిలుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :