మీ EPF రిజిష్టర్ మొబైల్ నంబర్ ను ఆన్లైన్ల్ లో ఎలా అప్డేట్ చేయ్యాలి..!!

Updated on 14-May-2022
HIGHLIGHTS

EPF అకౌంట్ యొక్క రిజిష్టర్ మొబైల్ నంబర్ అప్డేట్

UAN లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ లేదా చేంజ్ ఎలా చేయాలి

మీ EPF రిజిస్టర్ మొబైల్ నంబర్ ను ఈజీగా అప్డేట్ చెయ్యవచ్చు

EPF అకౌంట్ యొక్క రిజిష్టర్ మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ చేయాలి అని ఆలోచిస్తున్న ఎంప్లాయిస్ కు సహాయం అందించడం కోసం ఈరోజు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ చేయాలో ఈరోజు చూద్దాం. మీ EPF అకౌంట్ కి సంబంధించి మీకు అన్ని అవసరాలకు ముఖ్యంగా అవసరమైనది UAN నంబర్. UAN నంబర్ అంటే, యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఇందులో, మీరు ఒకే UAN నంబర్ లో మీ అన్ని కంపెనీల EPF వివరాలు ఉంటాయి.

అంటే, ఒకప్పుడు పనిచేసే కంపెనీ నుండి ఎంప్లాయి మరొక కంపెనీకి మారినప్పుడు వారి PF మారుతుంది మరియు పాత నంబర్ క్లోజ్ చేయ్యడం జరిగేది. అందుకే, ఒకే నంబర్ పైన జీవితాంతం అన్ని EPF లను అనుసంధానం చేసేలా ప్రభుత్వం ఈ UAN నంబర్ విధానం తీసుకొచ్చింది. అయితే, సాధారణంగా మనం కొత్త నంబర్ తీసుకున్నప్పుడు లేదా పాత నంబర్ ను మార్చవలసి వచ్చినప్పుడు EPF అకౌంట్ లో ఎలా అప్డేట్ చెయ్యాలో చాలా మందికి తెలియక పోవచ్చు. అందుకే, UAN లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ లేదా చేంజ్ ఎలా చేయాలి అనే విషయాన్ని సవివరంగా చర్చిస్తున్నాను.

UAN లో మొబైల్ నంబర్ ఎలా మార్చాలి?

ముందుగా UAN మెంబర్ e-సేవ పోర్టల్ ఓపెన్ చెయ్యాలి

ఇక్కడ మీ UAN నంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి

లాగిన్ అయిన తరువాత ఇక్కడ మీకు మైన్ పేజ్ కనిపిస్తుంది

మైన్ పేజీలో Manage అనే అప్షన్ కనిపిస్తుంది, దీని పైన నొక్కండి

ఇక్కడ మీరు Contact Details పైన నొక్కండి

ఇక్కడ మీకు మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ క్రింద Change Mobile Number అప్షన్ కనిపిస్తుంది

ఇక్కడ Change Mobile Number పక్కన బాక్స్ పైన టిక్ చేయండి

వెంటనే మీకు కొత్త నంబర్ అప్డేట్ లేదా చేంజ్ చేయాల్సిన నంబర్ ఎంటర్ చేసి ఆధరైజ్ చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :