లాకా డౌన్ కొనసాగుతున్న కాలంలో, ఎంటర్టైన్మెంట్ సాధనంగా ప్రజలు కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఇది వారి రోజువారీ కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది. అయితే, అటువంటి స్మార్ట్ ఫోన్ దొంగతనం లేదా పోగొట్టుకోవడం వంటి విషయం వారికీ నిద్రలేని రాత్రులు మిగిలిస్తుంది.
కాబట్టి, ఎవరైనా వారి ఫోన్ ను పోగొట్టుకుంటే కంగారు పడకుండా కొన్ని ఉత్తమమైన మార్గాల ద్వారా వెంటనే కనిపెట్టే ప్రయత్నాలు చెయ్యొచ్చు. మీ ఫోన్‌ను గుర్తించగలిగే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని అనుకోవద్దు. మీరు కోల్పోయిన ఫోన్‌ను ట్రాక్ చేసి కనిపెట్ట గల కొన్ని మంచి మార్గాలు ఇక్కడ చూడవచ్చు.
Find My Device అనేది Android- ఆధారిత పరికరాల కోసం Google అందించే ఒక ఫీచర్. ఇది అనుకోకుండా మర్చిపోయిన లేదా పోగొట్టుకున్న వారి ఫోన్‌లు, టాబ్లెట్ లేదా వేరబుల్స్ వస్తువులను ట్రాక్ చేయడానికి మరియు కనుగొనడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. ప్రతి Android స్మార్ట్‌ఫోన్‌తో ఈ సేవ అందించబడుతుంది మరియు మీరు Google ఖాతాతో సైన్ ఇన్ చేసి ఉంటే, Find My Device అప్రమేయంగా ప్రారంభించబడుతుంది.
Find My Device సర్వీస్ ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి, సైలెంట్ మోడ్‌లో కూడా సమీపంలో ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి సౌండ్ ప్లే చేస్తుంది మరియు మీ ప్రైవేట్ డేటాను సురక్షితంగా ఉంచడానికి చివరి సహాయంగా స్మార్ట్ ఫోన్ లేదా డివైజ్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ఒక ఎంపికను అందిస్తుంది. ఒకవేళ మీరు మీ Android ఫోన్‌ను కోల్పోయినట్లయితే, ఫోన్‌ను ట్రాక్ చేయడానికి మరియు దాని ఆచూకీ తెలుసుకోవడానికి ఈ క్రింది దశలు మీకు సహాయపడతాయి.