ఇలా చేస్తే మీ ఓటు తొలగించే సమస్యే ఉండదు !

Updated on 07-Mar-2019
HIGHLIGHTS

ఈ మధ్య కాలంలో AP లో ఓట్లను తొలగించడం పెద్ద సమస్యగా మారింది.

మనం రోజు ఎవరో ఒకరి నోటివెంట నా ఓటు తోలింగించారు అని వినడం పరిపాటిగా మారింది ఇప్పుడు. ప్రస్తుతం వస్తున్నా కొన్ని నివేదికల ప్రకారం, చాల మంది ఓట్లు తొలిగించబడ్డయి అని రోజు వార్తల్లో చూస్తున్నాం మరియు ప్రముఖుల ఓట్లు కూడా తొలిగించినట్లు మనకు వార్తల ద్వారా తెలుస్తోంది. ఇది ఆలా ఉంచితే, అసలు మన ఓటుకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మనకు ఎప్పటికప్పుడు తెలుస్తూవుంటే, మనకు అసలు ఇటువంటి సమస్య రాదు అని మీకెప్పుడైనా అనిపించిందా?

అంటే, మీ ఓటు ని ఫారం 7 లో చేర్చి దాని ద్వారా తోలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, అది మీకు గనుక వెంటనే తెలుసుకోగలిగితే ? వెంటన్ స్పందించి మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేయవచ్చు. అవును అలాంటి ఒక ఎంపిక అందరికోసం అందించి ఎలక్షన్ కమిషన్ తమ సైట్ ద్వారా.  ఇలాంటి ఒక ఎంపిక మీకు అందుబాటులో ఉందని మీకు గనుక తెలియక పొతే, ఇప్పుడు ను తెలిపి అవివారాల ద్వారా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

ముందుగా మీరు ఎలక్ట్రోల్ ఫోటో ఐడెంటిటీ కార్డు (EPIC)లేదా ఓటర్ ID తో మీ యొక్క మొబైల్ నంబర్ ని నమోదు చేసుకోవడానికి ప్రభత్వ వెబ్సైట్ అయినటువంటి, http://ceoaperms.ap.gov.in/AP_MobileNoRegistration/MobileNoRegistration.aspx లో వెళ్ళాలి. తరువాత, వెబ్ పేజీలో సూచించిన దగ్గర మీ యొక్క EPIC నంబరును నమోదుచేయాలి. ఇక్కడ మీకు మీ వివరాలతో కూడిన ఒక పేజీ ఓపెన్ అవుంతుంది. ఈ పేజీలో, సూచించిన దగ్గర మీ మొబైల్ నంబరును నమోదుచేయాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషం ఏమిటంటే, మీ నంబరును సరిగా చూసుకుని నమోదుచేయాలి మరియు పనిచేస్తున్న నంబరును మాత్రమే ఎంటర్ చేయాలి.

చివరిగా, మీరు నమోదు చేసిన నామ్,నంబరుకు ఒక OTP అందించబడుతుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక మీ ఓటర్ ID తో మీ మొబైల్ నంబరు జత చేయబడుతుంది. కాబట్టి, మీ ఓటర్ ID కి సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్లు మీరు నమోదు చేసిన మొబైల్ నంబరుకు నేరుగా అందించబడతాయి కాబట్టి,  మీరు మీ ఓటర్ ID గురించి అప్రమత్తంగా ఉండవచ్చు.                                             

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :