how to lock apps in android phone without any third party help
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు చాలా గుప్త ఫీచర్స్ కలిగి ఉంటాయి. వీటిలో చాలా ఫీచర్స్ చాలా మంది యూజర్లకు తెలియదు. వీటిలో ఈరోజు చూడనున్న ఫీచర్ కూడా ఒకటి. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా Android Phone Apps ఫోన్ లో ఉండే బిల్ట్ ఇన్ యాప్ లాక్ ఫీచర్ తో ఫోన్ లోని యాప్స్ ని లాక్ చేయవచ్చు. ఇది ఎలా చేయాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ లో అనేక యాప్స్ ఉంటాయి మరియు వీటిలో ముఖ్యమైన యాప్స్ కూడా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్, సోషల్ మీడియా, ఫోటోలు, పర్సనల్ డాక్యుమెంట్స్ వంటి డేటా కలిగిన యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ ని ఇతరులు నుంచి పరిరక్షించడానికి యాప్ లాక్ ఉపయోగపడుతుంది. అయితే, చాలా మంది ఈ ఫీచర్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ సహాయం తీసుకుంటారు. అయితే, ఆండ్రాయిడ్ పరికరాల్లో ఇన్ బిల్ట్ గా వచ్చే యాప్ లాక్ ఫీచర్ తో ఇది చాలా ఈజింగ్ చేయొచ్చు. దీనికోసం ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు.
ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేయడానికి మీ ఫోన్ సెట్టింగ్స్ లోని యాప్ లాక్ లేదా ప్రైవసీ ప్రొటెక్షన్ లో వెళ్లి ఈ ఫీచర్ ను సెట్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్ లో ఉన్న Apps ట్యాబ్ పై నొక్కండి. ఇక్కడ మీకు ఆప్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది మరియు అందుకో యాప్ లాక్ ఫీచర్ పై నొక్కండి. ఇక్కడ మీకు మీ ఫోన్ ఉన్న యాప్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ లిస్ట్ లో మీరు ప్రత్యేకంగా లాక్ చేయదలచిన యాప్స్ పక్కన ఉండే టోగుల్ ను అం చేయండి. తర్వాత దీనికోసం ప్యాట్రన్ లేదా పిన్ సెట్ సెట్ చేయండి. అంతే, ఈ ఫోన్ లో మీరు కోరుకున్న యాప్స్ కి లాక్ వేయబడుతుంది. ఈ ఫోన్ ఓపెన్ చేసినా ఈ యాప్స్ ఓపెన్ చేయాలంటే మేర్స్ సెట్ చేసిన సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Also Read: కేవలం రూ. 18,499 ఖర్చుతోనే Dolby Atmos QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!
ఒకవేళ మీరు లాక్ సెట్ చేయకుండా మీ ఫోన్ లో యాప్స్ దాచాలనుకుంటే మీ ఫోన్ లో ఉండే గెస్ట్ మోడ్ ఉపయోగించవచ్చు. అంటే, సడన్ గా మీ ఫోన్ ను ఇంకెవరికైనా ఇవ్వవలసిన అవసరం వస్తే గెస్ట్ మోడ్ లో అందించాం వంటివి చేయవచ్చు. గెస్ట్ మోడ్ లో మీ యాప్స్ దాచబడతాయి. ఈ మోడ్ కోసం ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి System ఎంచుకొని అందులో Multiple Users లోకి వెళ్లి Guest Mode ను ఎంచుకోండి.
ఇలా మీ ఫోన్ లో ప్రైవసీ ఎక్కువ అవసరమైన యాప్స్ ని ఇతరులు చూడకుండా ప్రత్యేకమైన లాక్ సెట్ చేసుకోవచ్చు.