how to check AP EAMCET 2025 Round 1 Seat Allotment Results updates
AP EAMCET 2025 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ అప్డేట్ ఈరోజు విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లు జూలై 22వ తేదీ అనగా నేడు ఈ అప్డేట్స్ విడుదల చేశారు. ఈ ఫలితాలు ఇప్పుడు eapcet‑sche.aptonline.in/EAPCET నుంచి లైవ్ చేయబడ్డాయి. ఎవరైతే ఈ కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, వారు హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలతో వారి అలాట్మెంట్ లెటర్ ను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు తగిన స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ చూడవచ్చు.
అలాట్మెంట్ లెటర్ అప్డేట్ మరియు డౌన్లోడ్ కోసం ముందుగా https://eapcet-sche.aptonline.in/EAPCET సైట్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లోపల సీట్ అలాట్మెంట్ రిజల్ట్ – రౌండ్ 1 లింక్ కోసం వెతకండి. ఈ లింక్ దొరికిన తర్వాత ఈ లింక్ పై క్లిక్ చేసి అందులో స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు అందించి సబ్మిట్ చేయండి. మీరు ఈ వివరాలు అందించి సబ్మిట్ చేయగానే మీ అలాట్మెంట్ వివరాలు మీ మొబైల్ లేదా సిస్టం స్క్రీన్ మీద దర్శనమిస్తాయి.
స్క్రీన్ అందిన మీ అలాట్మెంట్ వివరాలు చెక్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే, వెంటనే మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సెల్ఫ్ జాయినింగ్ మరియు అలాట్ కాలేజీ లో రిపోర్టింగ్ చేయడం. దీనికోసం జూలై 23 నుంచి జూలై 26వ తేదీ వరకు డేట్స్ ఫిక్స్ చేసింది.
Also Read: Nothing Phone (3a) పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అందుకోండి.!
కోరుకున్న కాలేజీలో సీటు అందుకున్న విద్యార్థులకు 2025 ఆగస్టు 4వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభిస్తుంది. రాష్ట్రంలో 2,64,840 మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయగా, 1,89,748 మంది ఇందులో ఉత్తీర్ణత పొందారు.