how to book Republic Day 2026 Tickets in online and offline
Republic Day 2026: భారతదేశానికి గర్వకారణమైన రిపబ్లిక్ డే పరేడ్ (Republic Day Parade) ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ప్రతి పౌరుడికి నేరుగా అందిస్తోంది. ఇది ఒక ప్రత్యేక అనుభూతి మరియు ఈ పరేడ్ ను ఒక్కసారైనా చూడాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. మీరు కూడా 2026 జనవరి 26న న్యూఢిల్లీ లో జరిగే ఈ వేడుక కళ్ళారా చూడాలనుకుంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ లో టికెట్స్ తీసుకొని వీక్షించే అవకాశం భారత ప్రభుత్వం అందించింది. దీనికోసం టికెట్లు ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా బుక్ చేసుకునే అవకాశం కూడా భారత ప్రభుత్వం అందిస్తోంది. రిపబ్లిక్ డే పరేడ్ టికెట్స్ Online మరియు ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవాలి అని వివరంగా తెలుసుకుందాం.
రిపబ్లిక్ డే 2026 పరేడ్ టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు ప్రభుత్వం అందించిన aamantran.mod.gov.in అఫీషియల్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ సైట్ లో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. మీరు మొదటి సారిగా బుక్ చేసే వారైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం మీ పేరు, ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ను అడిగిన వద్ద నమోదు చేయండి. క్రింద సూచించిన టెక్స్ ను నమోదు చేసి మొబైల్ నెంబర్ పై OTP అందుకోండి. ఈ ఓటీపీ నమోదు చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
మీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు OTP తో అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ప్రభుత్వం అందించే సీట్ బుకింగ్ సెక్షన్ లో మీకు నచ్చిన ఏరియా సెలెక్ట్ చేసుకుని మీ ఐడి ప్రూఫ్ తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇందులో రూ. 20 రూపాయలు మరియు రూ. 100 రూపాయల ప్రైస్ తో రెండు రకాల టికెట్స్ లభిస్తాయి. ఈ టికెట్స్ బుకింగ్ సెక్షన్ ఈరోజు నుంచి ఓపెన్ అయ్యింది మరియు జనవరి 14 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే, డైలీ ఉదయం 9 గంటలకు ఈ స్లాట్ ఓపెన్ అవుతుంది మరియు ఏరోజు బుకింగ్ ఆరోజే క్లోజ్ అవుతుంది.
Also Read: BSNL Super Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు.!
రిపబ్లిక్ డే 2026 పరేడ్ టికెట్స్ ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవడానికి, ఆరు ప్రాంతాల్లో బుకింగ్ పాయింట్స్ అందిచారు. ఈ ఆరు పాయింట్స్ ని సందర్శించి మీ టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనికోసం, ఈ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు ఖచ్చితంగా కాలింగ్ ఉండాలి. ఇక బుకింగ్ పాయింట్స్ విషయానికి వస్తే, సేనా భవన్ (గేట్ నెంబర్ 5), శాస్త్రి భవన్ (గేట్ నెంబర్ 3), జంతర్ మంతర్ (మెయిన్ గేట్ లోపల) పార్లమెంట్ హౌస్ (రిసెప్షన్), రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ (D బ్లాక్, గేట్ నెం. 3 అండ్ 4) మరియు కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ (గేట్ నెం.8) వద్ద ఈ టికెట్స్ ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ పాయింట్స్ కేవలం ఢిల్లీ లో మాత్రమే ఉన్నాయని గమనించాలి.