Whatsapp తో మీ HP గ్యాస్ బుకింగ్, చెకింగ్, సబ్సిడీ వివరాలు చిటికెలో చెయ్యొచ్చు

HIGHLIGHTS

ఇవన్నీ చేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు

Whatsapp తో మీ HP గ్యాస్ బుకింగ్, చెకింగ్, సబ్సిడీ వివరాలు చిటికెలో చెయ్యొచ్చు

ప్రస్తుత కొనసాగుతున్న లాక్ డౌన్ 2 సమయంలో కొన్ని అత్యవసర సేవలను మరింత సులభతరం చేశాయి. ముందుగా, గ్యాస్ బుక్ చేయడానికి ఏజెన్సీ వద్దకు వెళ్లడమో లేక టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయడమో చేయాల్సి వచ్చేది. ఇందులో టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసినతరువాత IVR అడిగిన ప్రకారం ఓపిగ్గా అన్ని నంబర్లను ఎంచుకోవాల్సి వచ్చేది. అయితే, HP గ్యాస్ తీసుకొచ్చిన ఈ  పద్దతితో కేవలం ఒక్క మెసేజితో గ్యాస్ బుక్ చెయ్యవచ్చు. కేవలం గ్యాస్ బుక్ చెయ్యడమే కాదు మరిన్ని వివరాలను కూడా తెలుసుకునే వీలుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

HP గ్యాస్ బుకింగ్           

HP గ్యాస్ సంస్థ, కొత్తగా  Whatsapp ద్వారా గ్యాస్ బుకింగ్ చేసే పద్దతిని ప్రకటించింది. అంతేకాదు, ఈ విధానంతో మీ గ్యాస్  కనెక్షన్ కి సంభంధించిన సబ్సిడీ, LPG ID, మీ కోటా మరియు మీకు మరేదైనా సహాయం కావాల్సి వస్తే అడగవచ్చు కూడా. అలాగే, ఇవన్నీ చేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

ఇందుకోసం HP గ్యాస్ యొక్క పాన్ ఇండియా వాట్స్ ఆప్ నంబర్ అయినటువంటి ' 9222201122 ' నంబరును మీ వాట్సా ఆప్ కంటాక్స్ లో సేవ్ చేసుకొని ఈ క్రింద తెలిపిన విధంగా మెసేజీని(చాట్) పంపాలి అంతే. 

1. మీ గ్యాస్ బుకింగ్ చేయ్యడానికి   – Book  అని పంపాలి

2. మీ LPG కోటా తెలుసుకోవడానికి – Quota అని పంపాలి

3. మీ LPG ID తెలుసుకోవడానికి    – Lpgid అని పంపాలి

4. మీ సబ్సిడీ తెలుసుకోవడానికి    – Subsidy అని పంపాలి

5. మరిన్ని వివరాల కోసం             – Help  అని పంపాలి

ఇందులో బుకింగ్ కోసం Book అని టైపు చేసి పంపిన తరువాత కన్ఫర్మేషన్ కోసం Y అని టైపు చెయ్యమని అడుగుతుంది. మీరు Y టైపు చేసి  పంపిన వెంటనే మీకు బుకింగ్ వివరాలు అందించబడతాయి.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo