ఈ చిన్న ట్రిక్స్ తో మీపిల్లలు YOUTUBE లో కేవలం మీరు కోరుకునే వీడియోలను మాత్రామే చూస్తారు

Updated on 20-Sep-2019
HIGHLIGHTS

పిల్లలు కేవలం వారికీ సరిపడిన వీడియో కంటెంట్‌ను మాత్రమే పొందుతారు.

ప్రస్తుతకాలంలో, అనేకమైన వీడియోల కోసం యూట్యూబ్  అత్యంత ప్రాచుర్యమైన  సులభమైన వేదికగా నిలుస్తుంది. ఈ ప్రసిద్ధ పాట్ఫారం, పెద్దలకు మాత్రమే కాదు పిల్లలల్లో  కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులోని చాలా వీడియోలు పిల్లల మానసిక ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గత కొంత కాలంగా, పిల్లలు వారి వయస్సుకు  తగని వీడియో కంటెంట్‌ను కూడా ఇందులో అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇటువంటి సమస్యలను నివారించడానికి, పిల్లల కోసం ప్రత్యేకంగాయూట్యూబ్ రూపొందించిన  యూట్యూబ్ కిడ్స్ అనే యాప్ ని ప్రారంభించింది మరియు పిల్లలు కేవలం వారికీ సరిపడిన వీడియో కంటెంట్‌ను మాత్రమే పొందుతారు. ఈ యాప్ లో, తల్లిదండ్రులు ఇలాంటి అనేక ఎంపికలను (అప్షన్) పొందుతారు, ఇది వారి పిల్లల వయస్సు ప్రకారం, వారి పిల్లలకు కంటెంట్‌ను అందిస్తుంది మరియు వారికి అనుచితమైన కంటెంట్ వారికీ చూపించబడదు.

పాస్ కోడ్‌ను యూట్యూబ్ కిడ్స్ యాప్‌లో సెట్ చేయండి

మీరు అనుసరించగల సున్నితమైన కంటెంట్‌ నుండి పిల్లలను దూరంగా ఉంచడానికి ఇది మంచి మార్గం.

మొదట Android లేదా iOS లో YouTube కిడ్స్ యాప్ తెరిచి, లాక్ బటన్‌పై నొక్కండి. ఈ బటన్ దిగువన ఉంది.

ఇక్కడ అడిగిన గణిత ప్రశ్నకు సమాధానము ఇవ్వండి మరియు సబ్మిట్ పైన క్లిక్ చేయండి.

నాలుగు అంకెల పాస్‌కోడ్‌ను ఇక్కడ సెట్ చేయడం ద్వారా కన్ఫర్మ్ చేయండి. ఈ పాస్‌కోడ్ ద్వారా మీరు యాప్ యొక్క సెట్టింగ్‌లను యాక్సెస్ చేయవచ్చు మరియు పరిమితిని కూడా జోడించవచ్చు. ఈ పాస్‌కోడ్ గురించి పిల్లలకు తెలియకపోతే వారు ఈ పరిమితులను అతిక్రమించి ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు.

YouTube కిడ్స్ యాప్ ద్వారా పిల్లలను సురక్షితంగా ఉంచవచ్చు.

ఖాతాలో సైన్ అప్ చేసిన తరువాత, ఈ దశలను అనుసరించడం ద్వారా పిల్లలను రక్షించవచ్చు.

మీ డివైజ్ లో  YouTube కిడ్స్  యాప్ తెరవండి.

దిగువన ఉన్న లాక్ బటన్‌పై నొక్కండి మరియు పాస్‌కోడ్‌ను నమోదు చేయండి.

సెట్టింగులకు వెళ్లి మీ పిల్లల ప్రొఫైల్ పేరును ఇక్కడ రాయండి.

Gmail పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి.

సెర్చ్ ఎంపికను తొలగించడానికి, సెర్చ్ ఎనేబుల్ ని నిలిపివేయండి, దీని ద్వారా మీ పిల్లలు వేర్వేరు వీడియోల కోసం సెర్చ్ చెయ్యలేరు.

మీరు కంటెంట్ అప్రువల్ ను ప్రారంభించాలి మరియు ఆ తర్వాత యాప్ యొక్క హోమ్ స్క్రీన్‌కు వెళ్లి మీరు వీడియో చూడాలనుకుంటున్న ఛానెల్‌లను ఎంచుకోండి.

పాజ్ వాచ్ హిస్టరీని ప్రారంభిస్తే, పిల్లలు సెర్చ్ పదం ఆధారంగా వీడియో వ్యూస్ మరియు వీడియోలను చూడలేరు.

మీరు ఈ YouTube కిడ్స్ యాప్ లో మీ పిల్లల కోసం Time Limit ని కూడా సెట్ చెయ్యవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :