తెలుగు రాష్ట్రలో చల్ల గాలులు వీస్తున్నా ఎండ తీవ్రత మాత్రం నానాటికి పెరుగుతోంది. అందుకే, రానున్న వేసవి కోసం ఒక మంచి కూలర్ ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం ఒక మంచి బ్రాండెడ్ రూమ్ కూలర్ కొనాలంటే కనీసం పదివేల రూపాయలైనా ఖర్చు చేయాల్సిందే. అందుకే, డబ్భును ఖర్చుచేసే ముందుగా మనకు తగిన మరియు సరైన ప్రోడక్ట్ నే తీసుకుంటున్నామా? లేదా అని చూసుకోవాలి. దీనికోసమే, ఈ 3 విషయాలను గుర్తుంచుకుంటే తక్కువ ధరలోనే మీ ఇంటికి తగిన ఒక మంచి ఎయిర్ కూలర్ ఎంచుకోవచ్చు.
మనం ఎటువంటి కూలర్ ని కొనాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే, కేవలం ఒక్కరు ఇద్దరి కోసం అయితే పర్సనల్ కూలర్ సరిపోతుంది. కానీ, మీ రూమ్ మొత్తం చల్లని గాలితో నింపాలంటే మాత్రం డెజర్ట్ కూలర్ ని తీసుకోవాల్సి వుంటుంది.
ఒక ఎయిర్ కూలర్ తీసుకునేప్పుడు అతిముఖ్యంగా చూడాల్సిన విషయం వాటర్ ట్యాంక్ కెపాసిటీ. ఎయిర్ కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో, కూలర్ కూడా అంత ఎక్కవ కూలింగ్ కెపాసిటీని కలిగి వుంటుంది. ఒక చిన్న రూమ్ కోసం 15 లీటర్ల కెపాసిటీ, మీడియం సైజు రూమ్ కోసం 25 లీటర్ల కెపాసిటీ మరియు పెద్ద రూమ్ కోసం కనీసం 40 లీటర్ల కెపాసిటీ గల కూలర్ ను ఎంచుకోవాలి.