here is best Makar Sankranti Wishes and images in telugu
Makar Sankranti Wishes: తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే పండుగ మకర సంక్రాంతి పండుగ రేపు జరుపుకుంటారు. ఉదయ తిథి ప్రకారం సంక్రాంతి పండుగ జనవరి 15 న జరుపుకుంటారు. పాడిపంటలు ఇంటికి చేరిన వేల కనుల పండుగ జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు నచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియచేయడం అందరికీ ఆనందంగా ఉంటుంది. అందుకే, ఇన్స్టాంట్ గా సెండ్ చేయదగిన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కొన్ని ఈరోజు అందిస్తున్నాము. అంతేకాదు, ఇన్స్టాంట్ గా సెండ్ చేయడానికి కూడా బెస్ట్ ఇమేజెస్ కూడా అందిస్తున్నాము.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పవిత్ర వేళ మీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
కుటుంబంతో కలిసి ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటూ, కొత్త సంవత్సరాన్ని కోటి ఆశలతో ప్రారంభించండి
సంక్రాంతి అంటే పంటల పండుగ మాత్రమే కాదు, మనసుల పండుగ కూడా, ఈ ఏడు మీ ఆశలు అన్ని నెరవేరాలి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు
సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణించే ఈరోజు మన జీవితాలు కూడా వెలుగు వైపు సాగాలి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు
పంటలతో కలిసి మీ జీవితం కూడా పండాలి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఆకాశానికి ఎగిరే గాలిపటాలు మాదిరిగా మీ జీవితం కూడా గొప్పగా ఎదగాలి, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
పండుగ అంటే పరివారంతో గడిపే అమూల్యమైన సమయం, ఈ పండుగ మీకు మీ కుటుంబంతో గడిపే గొప్ప వేడుక కావాలి, సంక్రాంతి శుభాకాంక్షలు
ముగ్గుల ముంగిళ్ళు, ముత్యాల వాకిళ్లు, నవ్వులు వెల్లువిరిసిన చెక్కిళ్లు ఈ పండుగ కావాలి జీవితంలో మరువలేని ఒక కావ్యం, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప కుటుంబం. ఈ కుటుంబంలో సంతోషం ఎప్పుడూ ఇలాగే కొలువుండాలి. హ్యాపీ సంక్రాంతి
ఉత్తరాయణం సూర్యుని ప్రయాణం అయితే, సంక్రాంతి మన ఆశల ప్రయాణం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
పంట కోత లాగే జీవితం కూడా సరైన సమయానికి ఫలిస్తుంది, ఫలితం కోసం ఎదురు చూడాలి పండుగ మాత్రం వేడుకగా జరుపుకోవాలి, 2026 సంక్రాంతి శుభాకాంక్షలు
ఇల్లంతా సందడి, ఊరంతా సందడి, ఎక్కడ చూసినా అందం ఇదే మన సంక్రాంతి పండుగ ఉనికి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Also Read: Jio 2026: జియో యూజర్ల కోసం అందించిన 2026 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్.!