ఈరోజుల్లో, ఫోటోలు, వీడియోలు మరియు చాలా ముఖ్యమైన డాక్యుమెంటరీలు వంటి సమాచారం సురక్షితంగా ఉంచడం చాలా మందికి గొప్ప సవాలుగా మారింది. అయితే, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్స్ లో ఉండే డేటా తరచూ అనేక సార్లు అనుకోకుండా కోల్పోతుంటాము, లేదా మనలో చాలామంది అనుకోకుండా డిలీట్ చేస్తుంటారు. ముఖ్యంగా, ఎక్స్ట్రనల్ మైక్రోSD కార్డులు లేదా హార్డ్ డ్రైవ్స్ వంటివి వాడినపుడు ఇటువంటివి జరుగుతుంటాయి. కానీ, వారు కోల్పోయిన లేదా డిలీట్ అయిన వాటిని ఎలా తిరిగి పొందాలో మాత్రం కొంతమందికి తెలియదు.
అనేక సందర్భాల్లో, ఈ సమాచారాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు, కొన్నిమనకు అనుకూలంగా ఉంటే, కొన్నిసార్లు హార్డ్ డ్రైవ్ క్రాష్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ పూర్తిగా క్రాష్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ను సూచించిన విధంగా చేయడంవలన, మీరు కోల్పోయిన మొత్తం సమాచారాన్ని తిరిగి పొందలేక పోయినప్పటికీ, మీరు దాదాపుగా చాలావాటిని తిరిగి పొందవచ్చు.
ఈ క్రింద సూచించిన 3 విధానాలతో డిలీట్ అయిన డేటా ని తిరిగి పొందవచ్చు.
మొదటి పద్దతి : Recycle Bin
విండోస్ ప్లాట్ఫారమ్ నుండి అంతర్నిర్మిత ఫీచర్ అయినటువంటి Recycle Bin నుండి మీరు ఇటీవలి డిలీట్ చేసిన డేటా( సమాచారాన్ని) తిరిగి పొందవచ్చు. అయితే, మీరు Recycle Bin న్నీ Empty చేసి ఉంటే మాత్రం ఈ పద్దతి ద్వారా డేటాని తిరిగి తీసుకురాలేము. ఇక ఏమిచేయాలో చూద్దాం. ముందుగా, Recycle Bin ఓపెన్ చేయాలి, తరువాత అక్కడ మీకు ఇప్పటి వరకు డిలీట్ చేయబడిన అన్ని ఫైల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మాకు కావాల్సిన ఫైల్ పైన Right క్లిక్ చేసి ఇక్కడ "Restore" ఆప్షన్ పైన నొక్కాలి. ఇలా చేయడంతో, మీకు కల్సిన ఫైల్ మీ కంప్యూటర్ డెస్క్ టాప్ పైన వచ్చి చేరుతుంది.
రెండవ పద్దతి : పాత వెర్షన్ రీస్టోర్ చేయడం
పైన తెలిపినట్లుయిగా, మీరు అనుకోకుండా ఒకవేళ Recycle Bin న్నీ Empty చేసి ఉంటే గనుక ఈ పద్దతిని ఉపయోగించి డిలీట్ చేసిన డేటాని తిరిగి తీసుకురావచ్చు. మీ విండోస్ బ్యాక్ అప్ చేయబడిన పాత వెర్షన్ ని రీ స్టోర్ చేయడం వలన, మీరు డిలీట్ చేసిన ఫైల్ ని తెరిగి పొందవచ్చు. ఇందుకోసం, ముందుగా మీరు మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లోని Start బటన్ పైన నొక్కడం ద్వారా మీరు ప్రాపర్టీస్ లోకి అనుమతించబడతారు. అటుతరువాత, ఫోల్డర్ ని ఎంచుకొని, రైట్ క్లిక్ చేయడంతో మాకు ఒక సెటింగుల యొక్క ఒక మైక్రో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ "Restore Previous Version" ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీరు కోల్పోయిన డేటాని తిరిగి పొందవచ్చు.
మూడవ పద్దతి : 3rd పార్టీ డేటా రికవరీ సాఫ్ట్ వేర్ ఉపయోగించి
పైన రెండు దశలలో మీరు కొల్పిన డేటా తిరిగి పొందలేక పోయినట్లయితే, మీరు డేటా రికవరీ సాఫ్ట్ వేర్ ఒకదాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఉదాహరణకు EaseUS డేటా రికవరీ విజార్డ్ పర్సనల్ , మీరు కోల్పోయిన డేటా రికవరీ చేయడనికి ఒక సులభమైన మరియు మంచి మార్గంగా చెప్పొచ్చు.
EaseUS డేటా రికవరీ విజార్డ్ కేవలం మీ ల్యాప్ టాప్ మరియు కంప్యూటర్లలో కోల్పోయిన డేటా మాత్రం కాకుండా, హార్డ్ డ్రైవ్, ఎక్స్ట్రనల్ USB హార్డ్ డ్రైవ్స్, ఫోన్లు మరియు మెమొరీ కార్డులలో కూడా కోల్పోయిన డేటాని తెరిగి తీసుకురావచ్చు.