GST 2.0 Reform new tax rule reduce tax on Smart Tv and air-condition
GST 2.0 Reform: భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన GST 2.0 రీఫార్మ్ భారత ప్రజలకు గొప్ప ఆనందం తెచ్చింది. ఎందుకంటే, ఈ కొత్త టాక్స్ స్లాబ్స్ తో బీద మరియు మధ్య తరగతి ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరనుంది. ఇందులో LPG సిలిండర్, హెయిర్ ఆయిల్, పెట్రోల్ మరియు మరిన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అంతేకాదు, కొత్త జీఎస్టీ తో Smart Tv మరియు AC ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.
కొత్త టాక్స్ స్లాబ్స్ తో స్మార్ట్ టీవీ మరియు ఏసీ ధరలు తగ్గుతాయా? అని అడిగితే సింపుల్ సమాధానం అవును అనే చెబుతారు. ఎందుకంటే, ముందుగా స్మార్ట్ టీవీ మరియు ఏసీ లపై అమలుచేసిన విలాసవంతమైన 28% GST స్లాబ్ నుంచి 18% జీఎస్టీ స్లాబ్ కు తగ్గించింది. అంటే, టెలివిజన్ మరియు ఎయిర్ కండిషనర్ పై 10% టాక్స్ తగ్గుతుంది. అందుకే, స్మార్ట్ టీవీ మరియు ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు మరింత తక్కువ రేటుకు లభించే అవకాశం ఉంటుంది.
జీఎస్టీ 2.0 రీఫార్మ్ సెప్టెంబర్ 22వ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఈ కొత్త జీఎస్టీ స్లాబ్ ను దీపావళి 2025 పండుగ కానుకగా ప్రజల కోసం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి, కూడా పండుగ సీజన్ లో అవసరమైన ప్రధాన వస్తువులు మరియు ఇతర వాటిపై టాక్స్ రేటు తగ్గించడం నిజంగా ప్రశంసనీయం అవుతుంది.
Also Read: GST On Mobile Phones: కొత్త జీఎస్టీ తో మొబైల్ రేట్లు తగ్గనున్నాయా!
స్మార్ట్ టీవీ మరియు ఏసీ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం నడుస్తున్న 28% జీఎస్టీ స్లాబ్ తో స్మార్ట్ టీవీ మరియు ఏసీ కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ఈ టాక్స్ స్లాబ్ ను 18% కి తగ్గించింది కాబట్టి రేటులో భారీగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 50 వేల రూపాయల విలువ కలిగిన ఒక స్మార్ట్ టీవీ లేదా ఏసీ కొనడానికి ప్రస్తుతం రూ. 14,000 జీఎస్టీ వసూలు చేస్తుండగా, కొత్త స్లాబ్ తో ఇది రూ. 9,000 రూపాయలకు తగ్గుతుంది. అంటే, నేరుగా రూ. 5,000 రూపాయల టాక్స్ తగ్గుతుంది. దీని కారణంగా, స్మార్ట్ టీవీ మరియు ఏసీ ఇప్పుడు మరింత చవక రేట్లకే లభించే అవకాశం ఉంటుంది.
దేశంలో అతిపెద్ద పండుగ సీజన్ అయిన దసరా మరియు దీపావళి సమయంలో ఈ కొత్త టాక్స్ స్లాబ్ తీసుకురావడం కూడా గొప్ప విషయం అవుతుంది. ఈ రెండు పండుగలకు కొత్త వస్తువులు కొనడం ఆనవాయితీగా ఉంటుంది. ఈ పండుగ సీజన్ కొత్త స్లాబ్ తో అటు వ్యాపారులకు ఇటు ప్రజలకు కూడా మరింత లాభదాయకంగా ఉండేలా ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.