Happy Birthday Google: గూగుల్ 28వ పుట్టిన రోజుకు తొలినాటి లోగో తో సెలెబ్రేషన్.!

HIGHLIGHTS

గూగుల్ ఈరోజు తన 28వ పుట్టిన రోజును జరుపుకుంటోంది

1998 లో చిన్న రూమ్ నుంచి టెక్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఒక చిన్న కంపెనీ గూగుల్

Google యావత్ ప్రపంచాన్ని చుట్టేస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు

Happy Birthday Google: గూగుల్ 28వ పుట్టిన రోజుకు తొలినాటి లోగో తో సెలెబ్రేషన్.!

Happy Birthday Google: గూగుల్ ఈరోజు తన 28వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. 1998 లో ఎన్నో ఆశలతో చిన్న రూమ్ నుంచి టెక్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఒక చిన్న కంపెనీ గూగుల్, యావత్ ప్రపంచాన్ని చుట్టేస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు ప్రపంచంలో గూగుల్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా గూగుల్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. సమాచారం మొదలుకొని మ్యాప్స్ వరకు యాప్స్ మొదలుకొని ఫోన్ OS వరకు యూట్యూబ్ మొదలుకొని సినిమాల వరకు ప్రతి చోటా గూగుల్ ఉంటుంది. గూగుల్ 28వ పుట్టిన రోజు సందర్భంగా పాత రోజులు గుర్తు చేసుకుంటూ, గూగుల్ రోజు తన తొలినాటి లోగో ని గూగుల్ సెర్చ్ పేజీలో డిస్ప్లే చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Happy Birthday Google: ఎక్కడి నుంచి ఎక్కడికి

గూగుల్ చాలా సుదీర్ఘ ప్రయాణం చేసింది. 1998 సంవత్సరంలో కేవలం ఒక చిన్న గదిలో గూగుల్ ప్రయాణం ప్రారంభం అయ్యింది. చిన్న గది అనడం కంటే చిన్న గ్యారేజ్ అనడం సమంజసం. 1998 లో స్టాన్‌ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులైన సెర్గీ బ్రిన్‌ మరియు లారీ పేజ్ ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. మార్కెట్లో తమకంటూ ఒక మంచి గుర్తింపు తీసుకోవాలి అనే ఆశతో మొదలైన ఈ చిన్న సెర్చ్ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆధారపడే ప్రధాన సెర్చ్ మార్గం గా మారింది. ఇది నిజంగా చాలా గర్వంగా చెప్పుకోదగిన ఎదుగుదల.

Happy Birthday Google

నిజానికి, గూగుల్ కంపెనీ 1998 సెప్టెంబర్ 4న అధికారికంగా స్థాపించబడింది. అయితే, 2026 నుంచి గుర్తించదగిన స్థాయిలో సెర్చ్ ఇండెక్స్ పేజీలు సెప్టెంబర్ 27 నుంచి గూగుల్ నమోదు చేసింది. అందుకే, సెప్టెంబర్ 27వ తేదీ గూగుల్ పుట్టిన రోజుగా చెబుతూ వేడుకలు చేస్తారు. గూగుల్ ఇప్పుడు మాను నుంచి మహా వృక్షంగా ఎదిగింది మరియు ట్రిలియన్ డాలర్స్ కంపెనీ గా అవతరించింది.

గూగుల్ లేకుండా ఒక రోజు ఊహించగలమా?

గూగుల్ లేకుండా ఒక రోజు ఊహించగలమా? అని ఊహ రావడమే ఒక పెద్ద పీడకలగా ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచంలో అన్ని విషయాలు తనలో ఇముడ్చుకున్న గూగుల్ అందరికి పెద్ద నేస్తంగా మారింది. ఇప్పుడంటే, చాట్ జిపిటి వంటి మరిన్ని ఏఐ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. కానీ, మూడు సంవత్సరాల క్రితం కూడా ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ‘గూగుల్ తల్లి’ మాత్రమే ఏకైక మార్గంగా ఉండేది.

అడ్రస్ కావాలంటే గూగుల్

ప్రపంచంలో ఎవరి అడ్రస్ అయినా జస్ట్ గూగుల్ మ్యాప్స్ ని అడిగితే చాలు చిటికెలో చెప్పేస్తుంది. ఆఫ్ కోర్స్, కొన్ని లిస్ట్ కానీ ప్రాంతాలు లేదా నిషిద్ధ ప్రాంతాల వివరాలు చెప్పదు అనుకోండి.

Also Read: Jio Offer: క్రియేటర్స్ కి గుడ్ న్యూస్ అందించిన రిలియన్స్ జియో.!

మొబైల్ కోసం ఆండ్రాయిడ్ OS

మరింత గొప్ప విలువలు అందించే మరియు అందరికీ యాప్స్ ను ఉచితంగా అందించే దిశగా మొబైల్ కోసం ఆండ్రాయిడ్ OS ను కూడా గూగుల్ అందించింది. ఆండ్రాయిడ్ ఓస్ లేకుండా మనం ఈరోజు ఉపయోగించే మొబైల్ మరియు యాప్స్ ను ఊహించగలమా, కచ్చితంగా ఊహించలేము.

ఇలా ఒకటేమిటి అనేక విషయాల్లో గూగుల్ తన ప్రతిభను మరియు సర్వీస్ ను విస్తరించింది. జస్ట్ చిన్న గ్యారేజ్ లో మొదలైన గూగుల్ ఈరోజు ట్రిలియన్ డాలర్స్ AI వ్యవస్థగా అవతరించిందంటే, దాని వెనుక ఎంత కృషి ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile