ఆపిల్, గూగుల్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్స్ పైన లొకేషన్ ట్రాకింగ్ నిషేధించనున్నాయి :రిపోర్ట్

ఆపిల్, గూగుల్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్స్ పైన లొకేషన్ ట్రాకింగ్ నిషేధించనున్నాయి :రిపోర్ట్
HIGHLIGHTS

యాప్స్ లో లొకేషన్ ట్రాకింగ్ వాడకాన్ని ఆపిల్ మరియు గూగుల్ నిషేధించనున్నాయి.

COVID-19 ను ట్రాక్ చేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ Apps తయారుచేసే డెవలపర్లు లొకేషన్ ట్రాకింగ్ పైన ఆధారపడలేరు. రాయిటర్స్ యొక్క నివేదిక ప్రకారం, రెండు కంపెనీలు అభివృద్ధి చేస్తున్న కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యవస్థను ఉపయోగించే యాప్స్ లో లొకేషన్ ట్రాకింగ్ వాడకాన్ని ఆపిల్ మరియు గూగుల్ నిషేధించనున్నాయి.

గత నెలలో, ఈ రెండు టెక్నాలజీ దిగ్గజాలు కూడా కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించాయి. పబ్లిక్ హెల్త్ అథారిటీస్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్స్  అభివృద్ధి చేయడం సులభం. కానీ, ప్రైవసీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ముఖ్య అంశం అని, ఈ రెండు సంస్థలు గుర్తించాయి. అందువల్ల, ఈ రెండు సంస్థలు కూడా ఎటువంటి దుర్వినియోగం లేకుండా తమ వినియోగదారుల డేటాను అనుసంధానం చేయడానికి చూస్తున్నాయి.ఇది జరగకుండా,  ఈ వ్యవస్థను వివిధ ప్రభుత్వాలు ఉపయోగించటానికి ఇష్టపడవు. అందుకని, కొత్త వ్యవస్థలో ఎన్కౌంటర్లను గుర్తించడానికి బ్లూటూత్ సిగ్నల్లపై మాత్రమే ఆధారపడుతుంది. అంతేకాదు, ఇది GPS లొకేషన్  డేటాను ఉపయోగించదు లేదా స్టోర్ చేయదు.

కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్స్ పైన లొకేషన్ ట్రాకింగ్ ని ఆపిల్ మరియు గూగుల్ నిషేధిస్తాయి

ఏదేమైనా, కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ తో కలిసి జిపిఎస్ డేటాను ఉపయోగించడానికి అనుమతించడం చాలా అవసరమని US లో  అధికారిక కరోనావైరస్-సంబంధిత ట్రాకింగ్ యాప్స్ డెవలపర్లు చెప్పినట్లు, రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వ్యాప్తి ఎలా కదులుతుందో తెలుసుకోవడానికి మరియు  స్పాట్లను గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు వాదించారు.

అయితే,  కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ ని ఉపయోగించడానికి ఈ రెండు కంపెనీలు కలగలిపి ఒక యాప్ ని మాత్రమే అనుమతిస్తాయని నివేదిక పేర్కొంది. విచ్ఛిన్నతను నివారించడానికి మరియు విస్తృత స్వీకరణను ప్రోత్సహించడానికి ఇది జరిగింది. ఏదేమైనా, US వంటి రాష్ట్ర లేదా ప్రాంతీయ విధానాన్ని ఎంచుకునే దేశాలకు తాము మద్దతు ఇస్తామని ఈ రెండు సంస్థలు తెలిపాయి.

వాస్తవానికి, చాలా ఆరోగ్య సంస్థలు ఆపిల్ మరియు గూగుల్ అభివృద్ధి చేసిన వాటిని ఉపయోగించకుండా వారి స్వంత కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. GPS మరియు బ్లూటూత్ రెండింటితో పనిచేసే అమెరికాలోని ఉటాలో ఉపయోగించిన హెల్తీ టుగెదర్ యాప్  ఈ నివేదికలో ఉంది. అయినప్పటికీ, కెనడా యొక్క అల్బెర్టా ప్రావిన్స్ వంటి కొన్ని ఉన్నాయి, అవి ఆపిల్-గూగుల్ వ్యవస్థను ఉపయోగించని ABTraceTogether యాప్, ఇది GPS లొకేషన్ డేటాను కూడా సేకరించవు.

భారతదేశం యొక్క సొంత కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ : ఆరోగ్య సేతు

భారతదేశం ఆరోగ్యా సేతు అనే సొంత కాంటాక్ట్ ట్రేసింగ్ App ని కూడా అభివృద్ధి చేసింది. ఈ యాప్ పని చేయడానికి లొకేషన్ మరియు బ్లూటూత్ డేటా రెండింటినీ ఉపయోగిస్తుంది. ప్రారంభించినప్పటి నుండి ఆరోగ్యా సేతు కేవలం 13 రోజుల్లో 50 మిలియన్ డౌన్లోడ్ల మైలురాళ్లను చేరుకుంది, ఈ  యాప్, ఆండ్రాయిడ్ లేదా iOSలలో వేగంగా విస్తరిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo