అనుకోకుండా ఈ స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రిలీజ్ చెయ్యబడింది

అనుకోకుండా ఈ స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రిలీజ్ చెయ్యబడింది
HIGHLIGHTS

అనుకోకుండా కొన్ని స్మార్ట్ ఫోన్లకు ఈ అప్డేట్ విడుదల చేయబడిందని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 11 యొక్క కొన్ని క్రొత్త ఫీచర్లు ఈ కొత్త బీటాలో కనుగొనబడ్డాయి.

గూగుల్ జూన్ 3 న జరపనున్నట్లు ప్రకటించిన, గూగుల్ I / O ఆన్లైన్ కార్యక్రమాన్ని అమెరికాలో కొనసాగుతున్న అల్లర్ల కారణంగా రద్దు చేసింది. ఆయితే, ఈ కార్యక్రం ద్వారా ఈ సెర్చ్ దిగ్గజం తన ఆండ్రాయిడ్ 11 బీటాను ప్రజలకు విడుదల చేయచేయడానికి నిర్ణయించింది . కానీ, అమెరికా సంయుక్త  రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం ఇటీవల వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈవెంట్‌ను వాయిదా వేయాలని మరియు ఆండ్రాయిడ్ 11 బీటా విడుదలను కూడా నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించినప్పటికీ, అనుకోకుండా కొన్ని Pixel  స్మార్ట్ ఫోన్లకు ఈ అప్డేట్ విడుదల చేయబడిందని తెలుస్తోంది. ట్విట్టర్లో @ మిషల్ రహ్మాన్ నివేదిక ప్రకారం, ఇది నిజమని చెప్పవచ్చు. అయితే, వినియోగదారులు  డెవలపర్ ప్రివ్యూలో ఉన్నారా లేదా అధికారిక సాఫ్ట్ ‌వేర్ తో నడుపుతున్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఆండ్రాయిడ్ 11 యొక్క కొన్ని క్రొత్త ఫీచర్లు ఈ కొత్త బీటాలో కనుగొనబడ్డాయి. మొదటి కొత్త పవర్ మెనూ కనిపించింది. రెహ్మాన్ ఈ అప్డేట్స్ గురించి ట్విట్టర్లో అన్నివివవరంగా తెలియ చేశాడు.

పెబుల్, వెసెల్ మరియు టాపెర్డ్ దీర్ఘచతురస్రంతో సహా హోమ్ ఐకాన్ స్టైల్ హోమ్ స్క్రీన్‌లో అందుబాటులో ఉన్నాయి. యాప్స్ ను బబుల్ చేయడానికి కనిష్టీకరించే ఎంపికను ఇచ్చే కొత్త బబుల్ మెను ఉంది. ఇది UI లో తేలుతుంది. ఇది ఫేస్ బుక్ మెసెంజర్ యొక్క చాట్ హెడ్ లాంటిది.

పిక్సెల్ లాంచర్ యాప్ డెకరేషన్ ను హోమ్ స్క్రీన్‌లో బాటమ్ లైన్‌లో ఉంచవచ్చు. ఆండ్రాయిడ్ 11 బీటా యొక్క అన్ని ఫీచర్ల జాబితాను చూడటానికి, మీరు ఈ ట్విట్టర్ థ్రెడ్‌ను చెక్ చేయవచ్చు.+

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo