మ్యూజిక్ ప్రియులకు శుభవార్త : ఇక పాటలు కూడా Dolby Atmos లోనే

Updated on 17-Jun-2019
HIGHLIGHTS

ఇప్పుడు డాల్బీ మరియు యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ రెండూ కూడా కలిసి సంయుక్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి కొన్ని వేల పాటలను Dolby Atmos లోకి మార్చనున్నాయి.

సినిమా థియేటర్లో రియల్ సౌండ్ అందించే టెక్నాలజీగా పేరుగాంచిన Dolby Atmos అందించినటువంటి డాల్బీ లేబొరేటరీస్ ఇప్పుడు సంగీతాన్నిఅంటే పాటలను కూడా డాల్బీ సౌండుతో వినేలా అవకాశాన్ని తీసుకొచ్చింది. మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ లో ప్రపంచంలోనే గొప్పదైనటువంటి, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ (UMG) మరియు Dolby  Atmos భాగస్వామ్యంతో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ ప్రియులందరికోసం ఒక కొత్త సరికొత్త మ్యూజిక్ అనుభూతిని అందించనున్నారు, అదే Dolby Atmos For Music.
ఇప్పుడు డాల్బీ మరియు యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ రెండూ కూడా కలిసి సంయుక్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి కొన్ని వేల పాటలను Dolby Atmos లోకి మార్చనున్నాయి. దీని ద్వారా, ఇప్పటి వరకు సినిమాలలో మనం వింటునటువంటి, నిజమైన సరౌండ్ సౌండ్, 3D ఎఫెక్ట్ మరియు పూర్తి డెప్త్ సౌండ్ మనకు అందుతుంది. అంటే, మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ పూర్తి అంచుల వరకు అందిస్తుంది.
ప్రస్తుతం మనం వింటున్న మ్యూజిక్ 2.1 ఛానల్ సౌండుతో సంగీతాన్నిఅందిస్తుంది. అయితే, ఈ టెక్నాలజీ వచ్చిన తరువాత ఇది 7.1 వరకు అన్ని ఫార్మాట్లలో మనకు సంగీతాన్ని వినగలిగే అవకాశాన్ని కల్పించేలా ఉండవునట్లు అనిపిస్తోంది. ఇది ప్రస్తుతం కొన్నివేల పాటలకు పరిమితమైన కూడా రానున్నరోజుల్లో ఎక్కువ శాతం పాటలకు సొంతం కావచ్చని ఆశించవచ్చు. 

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :