Gold Rate: ఆకాశాన్ని అంటిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!

HIGHLIGHTS

బంగారం ధర ప్రస్తుతం ఆగకుండా పెరుగుతూనే వుంది

ఒక్క వారంలోనే బంగారం ధర రూ.3,000 పైగా పెరిగింది

ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది

Gold Rate: ఆకాశాన్ని అంటిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే.!

Gold Rate: బంగారం ధర ప్రస్తుతం ఆగకుండా పెరుగుతూనే వుంది. కేవలం ఒక్క వారంలోనే బంగారం ధర రూ.3,000 పైగా పెరిగిందంటే, మీరు పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. అయితే, గోల్డ్ మార్కెట్ పోకడను చూస్తున్న పసిడి ప్రియులు నివ్వెరపోతున్నారు. ఈ వారం గోల్డ్ మార్కెట్ ప్రయాణం మరియు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ను తెలుసుకుందామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gold Rate:

గత వారం, అంటే మార్చి 10వ తేదీన రూ.50,900 రూపాయల వద్ద ఉన్న10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.53,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ వారం రోజులలో రూ.2,900 రూపాయలు పెరిగినట్లు మనం చూడవచ్చు. అలాగే, రూ.55,530 రూపాయల వద్ద ఉన్న10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.58,690 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ వారం రోజులలో రూ.3,160 రూపాయలు పెరిగినట్లు మనం చూడవచ్చు.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,690 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,690 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,840 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo