Gemini Reimagine ఫీచర్ తో కలా నిజమా అనే రీతిలో ఫోటోలకు కొత్త రూపం.. మరి మీరు ట్రై చేశారా.!

Updated on 26-Aug-2025
HIGHLIGHTS

గూగుల్ యొక్క AI పవర్ జెమినీ లో కొత్త ఫ్యూచర్ Gemini Reimagine ని జత చేసింది

ఈ ఫీచర్ తో కలా నిజమా అనే రీతిలో పాత ఫోటోలకు కొత్త రూపం పొందవచ్చు

మీకు నచ్చిన ఇమేజ్ ని సరికొత్త రూపంలో క్రియేట్ చేసుకుని షేర్ చేయవచ్చు

గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్, జెమినీ లో కొత్త ఫ్యూచర్ ని జత చేసింది. అదే Gemini Reimagine ఫీచర్. గూగుల్ కొత్తగా తెచ్చిన ఈ ఫీచర్ తో కలా నిజమా అనే రీతిలో పాత ఫోటోలకు కొత్త రూపం పొందవచ్చు. కొత్త రూపం అనడం కంటే మీకు ఇష్టం వచ్చిన విధంగా మార్చుకోవటం అని చెప్పడం సరిగా ఉంటుంది. ఏఐ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇప్పటివరకు ఏవేవో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాటిని మీరు ట్రై చేసి ఉంటారు. అయితే, జెమినీ లో వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా మీరు ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండానే మీకు నచ్చిన ఇమేజ్ ని సరికొత్త రూపంలో క్రియేట్ చేసుకుని షేర్ చేయవచ్చు. మరి ఈ కొత్త ఫీచర్ ని మీరు కూడా ట్రై చేశారా? ఒకవేళ చేయకుంటే, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

Gemini Reimagine ఫీచర్ ఏమిటి?

గూగుల్ జెమినీ లో ఇప్పుడు ఒక కొత్త మేజర్ అప్డేట్ అందించింది. అదే ఈ కొత్త రీ ఇమేజిన్ ఫీచర్ మరియు ఈ కొత్త ఫీచర్ ఇమేజెస్ కోసం అందించింది. ఈ కొత్త ఫీచర్ తో మీరు ఎటువంటి ఎడిటింగ్ యాప్ లేదా ఎక్స్ పీరియన్స్ లేకుండా జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ తో చాలా గొప్పగా ఇమేజ్ ను రీ క్రియేట్ చేసి అందిస్తుంది. ఇది చూడటానికి మనం క్రియేట్ చేసిన ఇమేజ్ మాదిరిగా ఉండేలా క్రియేట్ చేస్తుంది. దీనికోసం కొత్త అప్ డౌన్ లోడ్ చేయాల్సిన పనిలేదు.

Gemini Reimagine తో ఇమేజ్ ను ఎలా రీ క్రియేట్ చేయాలి?

ఇది చాలా సింపుల్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో మీకు అందుబాటులో ఉన్న గూగుల్ జెమినీ ద్వారా మీరు మీరు కోరుకునే ఇమేజ్ ను రీ క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్ లోని గూగుల్ జెమినీ ఓపెన్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత క్రింద ఆ ఫోటోలు ఎలా క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారో ప్రాంప్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ పోస్ట్ చేస్తే సరిపోతుంది. వెంటనే జెమినీ మీరు కోరుకున్న ఇమేజ్ ను క్షణాల్లో రీ క్రియేట్ చేసే అందిస్తుంది.

వచ్చిన ఇమేజ్ మీకు నచ్చకుంటే అదే ఇమేజ్ ను మార్పులు కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా జస్ట్ చిన్న ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది.

Also Read: BSNL: దేశవాప్తంగా 4G సేవల విస్తరణ మరియు డోర్ స్టెప్ SIM తో పాటు Q-5G కోసం కొత్త చర్యలు.!

బెస్ట్ టిప్స్ ఏమిటి?

ఇందులో బెస్ట్ టిప్స్ ఏమిటంటే మీరు రీ క్రియేట్ చేయాలని కోరుతున్న ఇమేజ్ మంచి రిజల్యూషన్ కలిగిన ఇమేజ్ ఇవ్వండి. అలాగే, ఈ ఇమేజ్ కోసం మీరు అందించే ప్రాంప్ట్ అర్థవంతంగా ఉండేలా చూసుకోండి. ఇమేజ్ రీ క్రియేట్ చేసిన తర్వాత అదే ఇమేజ్ ను మళ్ళీ మళ్ళీ అప్‌లోడ్ చేయకండి. ఎందుకంటే, మీరు అందించిన ఇమేజ్ రీ క్రియేట్ సమయంలో కొంత చేంజ్ అవుతుంది. మరి అదే ఇమేజ్ అప్‌లోడ్ చేస్తే మరింతగా మార్పు చెందుతుంది. అది బహుశా మీ ఇమేజ్ ఇంకెవరిదో ఇమేజ్ అనిపించేలా చేస్తుంది.

Note: అందించిన ఇమేజ్ Gemini AI కొత్త ఫీచర్ తో క్రియేట్ చేయబడింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :