రూ.23,988 విలువైన ఏడాది Chat GPT Plus ఉచిత ఆఫర్ ప్రకటించింది.. ఎవరు అర్హులు అండ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.!

Highlights

OpenAI 12 నెలల ఉచితంగా ChatGPT Plus కొత్త కార్యక్రమాన్ని భారత్‌ లో ప్రవేశపెట్టింది

ఈ ఉచిత ఆఫర్ అందరికీ లభించదు

అర్హత కలిగిన వారికి 12 నెలలు ఉచితంగా లభిస్తుంది

ప్రముఖ AI సంస్థ OpenAI భారతీయ పరిశోధకులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. అర్హత ఉన్న అకడమిక్ పరిశోధకులకు 12 నెలల పాటు ఉచితంగా Chat GPT Plus అందించేందుకు కొత్త కార్యక్రమాన్ని ఇప్పుడు భారత్‌ లో కూడా ప్రవేశపెట్టింది. 'Chat GPT for Academic Researchers' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన పరిశోధకులు మరియు వారితో కలిసి పనిచేసే మరో ఇద్దరు సహచరులు కూడా ఉచితంగా చాట్ జిపిటి ప్లస్ సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

Chat GPT Plus ఉచిత ఆఫర్ అర్హులు?

ఈ ఆఫర్ సాధారణ Chat GPT వినియోగదారులందరికీ వర్తించదని మీకు మనవి. కేవలం గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న రీసెర్చ్ ఫ్యాకల్టీ సభ్యులు, పోస్ట్‌ డాక్టోరల్ పరిశోధకులు మాత్రమే ఈ ఉచిత ఆఫర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత మూడేళ్లలో పరిశోధన రంగానికి సంబంధించిన పరిశోధన ప్రచురణలు వారు కలిగి ఉండాలి. బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ అండ్ మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ విభాగాల్లో పరిశోధనలు చేసే వారు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి?

భారత్‌ లో ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తుల స్వీకరణ 2026 నవంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. OpenAI అధికారిక చాట్ జిపిటి ప్లస్ ఫర్ అకడమిక్ రీసెర్చర్స్ పేజీలో అందించిన అర్హతలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. విద్యాసంస్థకు సంబంధించిన వివరాలు, పరిశోధన ప్రచురణలు, మరియు పరిశోధనలో చాట్ జిపిటి ని ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో పూర్తి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి మాత్రమే ఈ ఉచిత ప్రయోజనం లభిస్తుంది.

Chat GPT Plus ఉచిత ఆఫర్ ప్రయోజనాలు?

ఎంపికైన వారికి 12 నెలల పాటు మూడు చాట్ జిపిటి ప్లస్ సీట్లు ఉచితంగా లభిస్తాయి. పరిశోధన పత్రాలు విశ్లేషించడం, కొత్త పరిశోధనా ఆలోచనలు అభివృద్ధి చేయడం, డేటా విశ్లేషణ, పరిశోధన కోడ్ రాయడం, బగ్స్ గుర్తించడం, పరిశోధనా పత్రాలు తయారీ వంటి పనులకు ఈ AI సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పరిశోధకుల డేటాను OpenAI తన AI మోడళ్ల శిక్షణకు డిఫాల్ట్‌ గా ఉపయోగించదు. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ క్లియర్ గా వెల్లడించింది.

సాధారణ ప్లస్ ప్లాన్ కోసం యూజర్లు సుమారు రూ.23,988 ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా పరిశోధన రంగానికి చెందిన అర్హులైన వారికి ఉచితంగా లభిస్తుంది. ఇది కేవలం పరిశోధన రంగానికి చెందిన అర్హులైన వారికి మాత్రమే వర్తిస్తుందని మీరు గమనించాలి.

సామాన్యులకు కూడా ఉచిత ఆఫర్

పైన తెలిపిన వన్ ఇయర్ ఉచిత ప్లస్ ఆఫర్ కాకుండా సామాన్యులకు కూడా ఉచిత ఆఫర్ అందించింది. అయితే, ఇది వన్ ఇయర్ కోసం కాకుండా కేవలం 1 నెల కోసం మాత్రమే అందించింది. అదేమిటంటే, చాట్ జిపిటి ప్లస్ ప్లాన్ ను మొదటిసారి ఎంచుకునే యూజర్లకు మొదటి నెల రోజులు ఉచితంగా అవకాశం చాట్ జిపిటి అందించింది. అయితే, రెండో నెల నుంచి ఈ ప్లాన్ కోసం రూ. 1,999 రూపాయలు చెల్లించాలి. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఉచిత ఆఫర్ మరియు ఇది 2026 డిసెంబర్ 23 నుంచి ప్రారంభం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile