Flipkart Big Saving Days: వినూత్నమైన అఫర్ తో వస్తోంది

HIGHLIGHTS

Flipkart Big Saving Days సేల్ యొక్క తేదీని ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.

ఈ సేల్ సెప్టెంబర్ 18 నుండి 20 వ తేదీ వరకూ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ఈ సంవత్సరం ఒక కొత్త వినూత్నమైన అఫర్ తో వస్తోంది.

Flipkart Big Saving Days సేల్ యొక్క తేదీని ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ సెప్టెంబర్ 18 నుండి 20 వ తేదీ వరకూ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ తీసుకొస్తోంది. అయితే, ఈ సంవత్సరం ఒక కొత్త వినూత్నమైన అఫర్ తో వస్తోంది.

అదేమిటంటే, కేవలం ఒక్క రూపాయితో కొన్ని ప్రోడక్ట్స్ ని Pre-Booking చేసుకోవచ్చు. అంటే, మీకు నచ్చిన ప్రోడక్ట్ ని కేవలం Rs.1 మాత్రమే చెల్లించి మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే, హెడ్ ఫోన్స్ పైన 60% డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో పాటుగా మరిన్ని ఆఫర్లతో వస్తోంది.

Work From Home, అంటే ఇంటి నుండి పని చేసేవారికి, స్టూడెంట్స్ ఈ సేల్ ద్వారా ల్యాప్ టాప్స్ కొనాలనుకునే వారికి మంచి ఆఫర్లను ప్రకటిస్తోంది. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్ టాప్స్ పైన గరిష్టంగా 30% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, Asus, Acer, HP, Lenovo మరియు MSI వంటి బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ మంచి డిస్కౌంట్ తో అమ్ముడు చేయనుంది.

Flipkart Big Saving Days బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, ఈ సేల్ ను SBI భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, ఈ సేల్ నుండి ప్రోడక్ట్స్ ను SBI క్రెడిట్ కార్డు లేదా EMI అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. అలాగే, TV, మొబైల్, రిఫ్రిజిరేటర్లతో పాటుగా అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే టీజ్ చేస్తోంది.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :