Flipkart Big Saving Days సేల్ భారీ ఆఫర్లతో వస్తోంది..!!

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరొకసారి వచ్చింది

Big Saving Days సేల్ భారీ ఆఫర్లతో వస్తునట్లు Flipkart ప్రకటించింది

ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరొకసారి వచ్చింది. ఈ అప్ కమింగ్ Big Saving Days సేల్ భారీ ఆఫర్లతో తీసుకువస్తునట్లు Flipkart ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ ఏప్రిల్ 12 వ తేదీ నుండి ఏప్రిల్ 14 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్స్ ను మంచి డిస్కౌంట్ మరియు ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు టీజింగ్ కూడా ఫ్లిప్ కార్ట్ మొదలుపెట్టింది. ఈ సేల్ నుండి టీవీల పైన 75% వరకూ భారీ డిస్కౌంట్ పొందవచ్చని, వాటితో పాటుగా మరిన్ని ఆఫర్లను తీసుకువస్తునట్లు కూడా చెబుతోంది. మరొక రెండు రోజుల్లో మొదలుకానున్న ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ గురించి మరిన్ని వివరాలను చూద్దాం.

ఈసారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ఈసారి ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ EMI తో వస్తువులను కొనుగోలుచేసే వారికీ ప్రోడక్ట్ డిస్కౌంట్ తో పాటుగా 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి నుండి స్మార్ట్ వాచ్ లను గరిష్టంగా 60% డిస్కౌంట్ తో, ల్యాప్ టాప్ ల పైన కూడా గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపించింది.

ఇక కొనుగోలుదారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :