Flipkart The Big Billion Days Sale కంటే ముందే భారీ Smart Tv ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

రానున్న పండుగల కోసం Flipkart The Big Billion Days Sale ను చేసింది

ఈ సేల్ కంటే ముందే చాలా గొప్ప Smart Tv ఆఫర్ ను అనౌన్స్ చేసింది

చవక ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గొప్ప స్మార్ట్ టీవీ డీల్

రానున్న పండుగల కోసం Flipkart The Big Billion Days Sale ను చేసింది. అయితే, ఇప్పుడు ఈ సేల్ కంటే ముందే చాలా గొప్ప Smart Tv ఆఫర్ ను అనౌన్స్ చేసింది. చవక ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అవుతుంది. ఎందుకంటే, అన్ని ఆఫర్లతో కలిపి ఈ 55 ఇంచ్ బిగ్ 4K స్మార్ట్ టీవీని కేవలం రూ. 23,499 రూపాయల ధరకే అందుకునే అవకాశం ఉంది. మరి ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.

ఏమిటా బిగ్ Smart Tv అఫర్?

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రకటించిన ఈ స్మార్ట్ టీవీ విషయానికి వస్తే, Coocaa రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55S3U Plus) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 58% భారీ డిస్కౌంట్ తో రూ. 24,999 ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా వుంది.

ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు IDFC FIRST క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని కేవలం రూ. 23,499 రూపాయల ధరకే పొందవచ్చు.

Also Read: లేటెస్ట్ Vu QLED Smart Tv పైన ధమాకా ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

Coocaa 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఇక ఈ కూకా 55 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 400 నిట్స్ బ్రైట్నెస్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ Coolita OS పై నడుస్తుంది మరియు ఇది Eye Care ఫీచర్ తో కూడా వస్తుంది.

ఇక ఈ స్మార్ట్ టీవీ 2 USB 2.0, 3 HDMI 1.4, LAN, 1AV, 1 డిజిటల్ ఆడియో, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగివుంది. ఈ కూకా స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, చవక ధరలో 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ డీల్ గా ఇది నిలుస్తుంది. అయితే, Netflix మరియు Disney+Hotstar యాప్స్ కి ఈ టీవీ సపోర్ట్ చేయదని గుర్తుంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :