హైదరాబాద్‌లో తొలి Apple Store .. డిసెంబర్ 10న ప్రారంభం.. లొకేషన్ ఎక్కడంటే.!
యాపిల్ ప్రియులకు యాపిల్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది
వినియోగదారులు కంపెనీకి చెందిన లేటెస్ట్ ప్రొడక్ట్స్ ను నేరుగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు
ఈ స్టోర్ ను 2026 డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది
యాపిల్ ప్రియులకు యాపిల్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో తన తొలి అధికారిక రిటైల్ Apple Store ను ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు అనౌన్స్ చేసింది. Apple Kukatpally పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్టోర్ ను 2026 డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో హైదరాబాద్ లోని ఐఫోన్, ఐప్యాడ్ మరియు మ్యాక్ బుక్ వినియోగదారులకు యాపిల్ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. అంతేకాదు, సర్వీస్ కష్టాలకు కూడా చెక్ పెట్టనున్నది.
Apple Store ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు?
ఈ కొత్త స్టోర్ ను హైదరాబాద్ లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న Lake Shore - Y Junction Mall లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది Dr. B. R. అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ కి కూత వేటు దూరంలో ఉంటుంది. ఇది యాపిల్ అధికారిక రీటైల్ స్టోర్ కావడంతో వినియోగదారులు కంపెనీకి చెందిన లేటెస్ట్ ప్రొడక్ట్స్ ను నేరుగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ మరియు Airpods వంటి ఉత్పత్తులను ఒకే చోట ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది.
హైదరాబాద్ కు మరో ప్రత్యేక గుర్తింపు
ఇప్పటికే IT హబ్ గా ప్రపంచ మ్యాప్ లో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించిన హైదరాబాద్ కి ఇది మరో గుర్తింపు గా ఉంటుంది. యాపిల్ అధికారిక స్టోర్ ఏర్పాటు కావడం స్థానిక టెక్ వినియోగదారులకు ముఖ్యమైన పరిణామం. ఇప్పటివరకు ఆన్ లైన్ లేదా ఇతర రిటైల్ దుకాణాల ద్వారా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వారికి ఇప్పుడు కంపెనీ ఏర్పాటు చేసే అఫీషియల్ స్టోర్ నుంచి నేరుగా రిటైల్ అనుభవం లభించనుంది. ఈ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక డిజిటల్ వాల్ పేపర్, స్టిక్కర్లు, Apple Music ప్లేలిస్ట్ ను కూడా సంస్థ పరిచయం చేసింది.
Also Read: AI నిజంగా డబ్బులు సంపాదించి పెడుతుందా .. లేక ఇదంతా ప్రచారమేనా.. అసలు నిజాలు తెలుసుకోండి.!
Apple Store లో ఎలాంటి సేవలు లభిస్తాయి?
యాపిల్ స్టోర్ లో కేవలం ప్రోడక్ట్ సేల్ మాత్రమే కాకుండా కాకుండా వినియోగదారులకు ప్రత్యేక సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త డివైజ్ లను ఎలా ఉపయోగించాలో తెలుసుకునేందుకు నిపుణుల సహాయం, వ్యక్తిగత కొనుగోలు సలహాలు మరియు యాపిల్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన మార్గదర్శకత్వం పొందవచ్చు. ముఖ్యంగా, ప్రోడక్ట్ రిపేర్లు మరియు సాంకేతిక సహాయం వంటి సేవల వివరాలను కూడా స్టోర్ లో నేరుగా తెలుసుకోవచ్చు.
మొత్తానికి, ఇప్పటివరకు కేవలం ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు వంటి నగరాలకు మాత్రమే అందుబాటులో ఉన్న యాపిల్ అఫీషియల్ స్టోర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.