fifa world cup 2026 where to watch in india zee5
FIFA World Cup 2026 : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీని భారతీయ ప్రేక్షకులు ఎక్కడ చూడాలి?అనే సందేహాలకు ఎట్టకేలకు ఇప్పుడు తెరపడింది. ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ Zee5 మరియు Zee గ్రూప్ కు చెందిన కొత్త స్పోర్ట్స్ నెట్ వర్క్ Unite8 Sports భారతదేశంలో ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రసార హక్కులు సొంతం చేసుకున్నాయి. ఇది ఫుల్ బాల్ ప్రేమికులకు పండుగ లాంటి వార్త అవుతుంది.
గత కొన్ని నెలలుగా ప్రపంచకప్ ప్రసార హక్కుల పై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, Zee ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మెగా డీల్ ను కుదుర్చుకోవడం భారత ఫుట్ బాల్ అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇకపై ప్రపంచకప్‌లోని ప్రతి కీలక మ్యాచ్ ను టీవీతో పాటు OTT లో కూడా వీక్షించే అవకాశం లభించింది. అంతేకాదు, ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ కోసం 3 మరియు 4 డివైజెస్ యాక్సెస్ తో రెండు కొత్త ప్లాన్స్ కూడా ప్రవేశపెట్టింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్ లను జీ5 లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మొబైల్, టాబ్లెట్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ వంటి డివైజెస్ లో ప్రపంచకప్ మ్యాచ్ లను ఆస్వాదించవచ్చు. ఈ టోర్నీ ద్వారా తన సబ్‌స్క్రైబర్ బేస్ ను మరింత పెంచుకోవాలని జీ5 లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
అంతేకాదు, OTT తో పాటు టెలివిజన్ ప్రేక్షకుల కోసం కూడా అవకాశం అందించింది. Zee కొత్తగా ప్రారంభించిన Unite8 Sports ఛానల్ లో అన్ని మ్యాచ్ లు ప్రసారం కానున్నాయి. HD మరియు SD ఫార్మాట్లలో ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను ఇప్పుడు జీ ఛానల్ కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
Also Read: Flipkart Sale బిగ్ డీల్ : లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 25 వేలకే అందుకోండి.!
అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ చరిత్రలోనే అతిపెద్ద ప్రపంచకప్ గా నిలవనుంది. ఈసారి 48 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో మొత్తంగా 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే, నెల రోజులకు పైగా ఫుట్ బాల్ అభిమానులకు కిక్ లభించనుంది.
క్రికెట్‌కు మాత్రమే కాకుండా ఫుట్ బాల్ కు కూడా భారతదేశంలో భారీ అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా కేరళ, గోవా, పశ్చిమ బెంగాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రపంచకప్‌కు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు జీ5 చేతికి హక్కులు రావడంతో ఫిఫా ప్రపంచ కప్ 2026 మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.