కేవలం ఆడియోతో కొత్త APP తీసుకొచ్చిన Facebook : గ్రూప్ కాలింగ్ మరింత సులభం

కేవలం ఆడియోతో కొత్త APP తీసుకొచ్చిన Facebook : గ్రూప్ కాలింగ్ మరింత సులభం
HIGHLIGHTS

వినియోగదారులు ఫేస్‌బుక్‌లో ఖాతాను కలిగి ఉండవలసిన అవసరం లేదు.

ఈ యాప్, 8 మంది వ్యక్తులతో గ్రూప్ కాల్స్ ను సెటప్ చేయగల Audio-Only యాప్

కరోనావైరస్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం ఇళ్లకే పరిమితమవ్వగా , వీడియో కాలింగ్ యాప్స్ లో పెరుగుదల మరియు కమ్యూనికేషన్ యొక్క అత్యంత ఇష్టపడే సాధనంగా మారడాన్ని మనం చూశాము. కానీ, CatchUP ప్రారంభించడంతో ఫేస్‌బుక్ ఆ ధోరణిని పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఈ యాప్, 8 మంది వ్యక్తులతో గ్రూప్  కాల్స్ ను సెటప్ చేయగల  Audio-Only  యాప్. మీ ఫోన్ యొక్క కాంటాక్ట్ జాబితాతో ఈ సర్వీస్ పనిచేస్తున్నందున వినియోగదారులు ఫేస్‌బుక్‌లో ఖాతాను కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఈ సౌలలభ్యంతో,ఇతర వినియోగదారులు మాట్లాడటానికి అందుబాటులో ఉన్నప్పుడు ఇది మీకు తెలియజేస్తుంది.

క్యాచ్‌అప్ ను కేవలం ఆడియో ద్వారా చేయాలన్న ఫేస్‌బుక్ నిర్ణయం వెనుక కారణం చాలా సులభం. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ఫేస్‌బుక్‌లోని ప్రొడక్ట్ లీడ్ నిక్కి షా ఇలా తెలిపారు, “ఈ సమయంలో, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటం ముఖ్యం.  ముఖ్యంగా షోషల్ డిస్టెన్స్ ఉన్న ఈ సమయంలో ఖచ్చితం. మెసేజింగ్ మరియు వీడియో కాలింగ్ క్విక్ అప్డేట్ పంపడానికి లేదా ముఖాముఖి వారితో కనెక్ట్ అవ్వడానికి గొప్ప మార్గాలు. కానీ, ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడటం సౌలభ్యం మరియు వ్యక్తిగత కనెక్షన్ రెండింటి యొక్క ప్రత్యేకమైన సమతుల్యతను అందిస్తుంది. మా అధ్యయనాల ఆధారంగా, ప్రజలు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ఎక్కువగా కాల్ చేయకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే వారు మాట్లాడటానికి అందుబాటులో ఉన్నప్పుడు లేదా వారు అసౌకర్య సమయంలో ఉన్న విషయం మనకు తెలియదు. క్యాచ్‌అప్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది మరియు గ్రూప్ కాలింగ్‌ను ఒక ట్యాప్ చేసినంత సులభం చేస్తుంది. ”.

ఈ అప్లికేషన్,  ప్రస్తుతం US ‌లో iOS మరియు ఆండ్రాయిడ్ ‌లో పరిమిత సమయం వరకు పరీక్షించబడుతోంది మరియు ఇది ప్రస్తుతానికి ఇతర ప్రాంతాలకు ఎప్పుడు వస్తుందనే దానిపై ఎటువంటి మాట లేదు. ఫేస్‌బుక్ కూడా భారతదేశంలో కొన్ని పెద్ద పురోగతులను సాధిస్తోంది, అలాగే రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌ లలో కంపెనీ 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. ఈ సోషల్ మీడియా దిగ్గజం గిఫ్-మేకింగ్ సైట్ GIPHY ని 400 మిలియన్లకు కొనుగోలు చేసింది మరియు ఈ యాప్ ని ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించాలని యోచిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo