స్వైన్ ఫ్లూ ని కూడా అడ్డుకోగల Air Purifiers వచ్చేసాయి

Updated on 05-Nov-2019
HIGHLIGHTS

సరికొత్త టెక్నాలజీతో రెండు కొత్త ఎయిర్ ప్యూరీ ఫయర్లను విడుదల చేసింది.

ప్రస్తుతం, కాలుష్య కోరల్లో చుక్కుకొని పలు పెద్ద నగరాల్లోని ప్రజలే కాకుండా, పల్లెలోని ప్రజలు కూడా అనేకరకాలైన బాక్టీరియాలు మరియు హానికరమైన వైరస్ కలిగిన గాలితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా, చలికాలంలో H1N1 వైరస్ లేదా స్వైన్ ఫ్లూ ని వంటివి విజృంభిస్థాయి, నమ్మినా నమ్మక పోయినా ఇది వాస్తవం. అటువంటి హానికారక వాతారణం నుండి కాపాడానికి, Eureka Forbes హెల్త్ హరియు హైజీన్ ప్రొడక్స్ అందించంలో పేరుగాంచిన సంస్థగా సుపరిచితమైన బ్రాండ్. ఇప్పుడు, ఈ సంస్థ సరికొత్త టెక్నాలజీతో రెండు కొత్త ఎయిర్ ప్యూరీ ఫయర్లను విడుదల చేసింది.

అనేకమైన ఎయిర్ పొల్యూషన్ సమస్యలకు సరైన సమాధానంగా, Eureka Forbes సంస్థ తీసుకొచ్చిన ఈ రెండు ఎయిర్ ప్యూరీ ఫయర్ల గురించి చెప్పొచ్చు. వీటిలో ఒకటి Aeroguard AP 700DX మోడల్ కాగా, మరొకటి Aeroguard HAP 500 ఇవి రెండు కూడా  H1N1 ఫిల్టర్ తో వచ్చిన మొట్టమొదటి ఎయిర్ ప్యూరీ ఫయర్లుగా నిలుస్తాయి. వీటిలో, AP 700DX  ఒక 6 అంచల (స్టేజ్) ఫిల్టర్ పద్దతిని కలిగి ఉండగా, HAP 500 మాత్రం 9 అంచల (స్టేజ్) ఫిల్టర్ పద్దతిని కలిగివుంటుంది. ఈ రెండు ఎయిర్ ఎయిర్ ప్యూరీ ఫయర్లను కూడా Rs.19,990 రూపాయల ఒకే ధరతో తీసుకొచ్చింది.

ఈ ఎయిర్ ప్యూరీ ఫయర్ల విడుదల సందర్భంగా, యురేకా ఫోర్బ్స్ యొక్క MD& CEO అయినటువంటి, Mr.Marzin R Sharoff మాట్లాడుతూ, "ఎయిర్ ప్యూరీ ఫయర్లు అనేవి లగ్జరీ కోసమే వాడుతారు అనే మాట ఎంతోకాలం ఉండదు.  ప్రస్తుతం, దేశంలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ కారణంగా, ఇకనుండి ఎయిర్ ప్యూరీ ఫయర్ల అనేవి ఒక అవసరంగా మారనున్నాయి. మేము అంధిస్తున్న ఈ ఎయిర్ ప్యూరీ ఫయర్లతో మీ ఇల్లు సురక్షితమైన మరియు పొల్యూషన్ లేనిదిగా (pollution free) ఉంటుంది", అని పేర్కొన్నారు.                   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :