EPFO 3.0: ఉద్యోగుల కోసం సరళమైన కొత్త విధానం కోసం ప్రభుత్వం చర్యలు.!

Updated on 21-Jan-2025
HIGHLIGHTS

PF అకౌంట్ క్లెయిమ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పాత విధానానికి స్వస్తి

ప్రస్తుతం కొనసాగుతున్న PF ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ పద్దతి విధానం పూర్తిగా మారిపోతుంది

వేగవంతమైన విధానాన్ని అమలులోకి తీసుకు రావడానికి నాంది

EPFO 3.0: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) ఉద్యోగుల PF అకౌంట్ కోసం కొత్త విధానాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. PF అకౌంట్ క్లెయిమ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పాత విధానానికి స్వస్తి పలికి కొత్త మరియు వేగవంతమైన విధానాన్ని అమలులోకి తీసుకు రావడానికి నాంది పలికింది. ప్రస్తుతం కొనసాగుతున్న జాబ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ పద్దతి విధానం పూర్తిగా మారిపోతుంది.

EPFO 3.0: ఏమిటి ఈ కొత్త విధానం?

ఒక ఉద్యోగి ఒక జబ నుంచి మరొక జాబ్ కి మారినప్పుడు మానేసిన కంపెనీ మరియు జాయిన్ అయిన కొత్త కంపెనీ మధ్య PF ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ కోసం ఆమోదం పొందవలసి వచ్చేది. అయితే, ఈ విధానానికి స్వస్తి పలికి ఈ పనులన్నీ నేరుగా మరియు చాలా సజావుగా కొనసాగే కొత్త ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తోంది.

2024 లో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) దాదాపుగా అన్ని PF ట్రాన్స్‌ఫర్ లను కూడా ఇరువర్గాల యాజమాన్య ప్రమేయం లేకుండానే సజావుగా ట్రాన్స్‌ఫర్ చేసింది. 1 ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈపీఎఫ్‌ఓకు ఆన్‌లైన్ పద్ధతిలో దాదాపుగా 1.30 కోట్ల ట్రాన్స్‌ఫర్ క్లెయిములు అందాయి. వీటిలో దాదాపు 45 లక్షలు ఆటో జనరేటెడ్ క్లెయిమ్స్ మరియు టోటల్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్స్ 34.5% ఉన్నాయని ఈపిఎఫ్ఓ తెలిపింది.

అయితే, ప్రతిపాదనలో ఉన్న కొత్త సవరించిన కొత్త విధానం వచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫర్ క్లెయిములు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నేరుగా పరిష్కరిస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఫలితంగా ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు అందే సేవలు వేగం అవుతాయని ఈపిఎఫ్ఓ పేర్కొంది.

Also Read: Moto G64 5G: ఇప్పుడు మరింత చవక ధరకు లభిస్తుంది.!

‘కొత్త తరం టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల అనుకూతకు తోడ్పడే కొత్త మరియు సౌకర్యవంతమైన విధానాలు ప్రవేశపెడుతూ, వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా సురక్షిత సేవలు అందించాలనేదే ఈపీఎఫ్ఓ యొక్క లక్ష్యం’ ఈ సందర్భంగా తెలియచేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :