ఇక ‘రెడ్ జోన్స్’ లో కూడా e-కామర్స్ కంప్లీట్ సర్వీసులు

ఇక ‘రెడ్ జోన్స్’ లో కూడా e-కామర్స్ కంప్లీట్ సర్వీసులు
HIGHLIGHTS

రెడ్ జోన్లలోని ప్రజలకు వస్తువులను సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అన్ని జోన్లలో తమ సేవలను అమలు చేయడానికి ఇ-టైలర్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.

మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖ మార్గదర్శకాల జాబితాను జారీ చేసింది

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలకు రెడ్ జోన్లలోని ప్రజలకు వస్తువులను సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నాల్గవ దశ లాక్డౌన్ అమల్లోకి రావడంతో, మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖ మార్గదర్శకాల జాబితాను జారీ చేసింది, ఇది ముందుగా ఉన్న కొన్ని ఆంక్షలను సడలించింది.

గతంలో, ప్రభుత్వం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారం లను నిషేధించింది మరియు అనవసరమైన ఉత్పత్తులను పంపిణీ చేయడాన్ని నిషేధించింది. తదనంతరం, ఈ ఇ-టైలర్లు గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో పూర్తిగా పనిచేయడానికి అనుమతినిచ్చింది.  అయితే చాలా ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. కాబట్టి, ఇక్కడ మొబైల్ ఫోన్లు మరియు ల్యాప్‌టాప్స్ వంటి అత్యవసరం కానీ ప్రోడక్ట్స్ డెలివరీకి అనుమతించబడలేదు.

దేశవ్యాప్త లాక్డౌన్ యొక్క 54 వ రోజు, ప్రభుత్వం ఇటువంటి ఇ-కామర్స్ కంపెనీలను తమ వినియోగదారులకు రెడ్ జోన్లలో కూడా పూర్తి సామర్థ్యంతో సేవ చేయడానికి అనుమతించింది. అయితే, కంటామినేషన్ జోన్ అని ప్రకటించినవి మినహా అన్ని జోన్లలో తమ సేవలను అమలు చేయడానికి ఇ-టైలర్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.

లాక్డౌన్ యొక్క మూడవ దశ నుండి, ఇ-కామర్స్ కంపెనీలు గ్రీన్ మరియు ఆరంజ్జోన్లలో నివసించే వినియోగదారులచే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌ టాప్స్ మరియు మరిన్ని ఉత్పత్తుల కోసం ఆర్డర్ ‌లను స్వీకరించడం ప్రారంభించాయి. వన్‌ప్లస్ 8 సిరీస్, ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఇ 2020 మరియు మరిన్ని స్మార్ట్‌ ఫోన్ల కోసం ప్రీ-బుకింగ్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

ఇప్పుడు నాల్గవ లాక్డౌన్ అమలులో ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లలో అనవసరమైన ఆర్డర్ ‌లను కూడా అనుమతించింది మరియు స్మార్ట్‌ ఫోన్ తయారీదారులు కొత్త ప్రోడక్ట్ లాంచ్‌ మరియు ఆన్‌లైన్ ఈవెంట్‌లతో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం మనం చూడవచ్చు. COVID-19 వ్యాప్తి చెందడాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసే నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల నుండి అనుమతి పొందారా లేదా అనే దాని ఆధారంగా కంపెనీలు రెడ్ జోన్లలో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.

తాజా మార్గదర్శకాలకు సంబంధించి, స్థానిక రవాణాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ నడపడానికి అనుమతి ఉంది. రాబోయే రోజుల్లో UBER మరియు OLA సర్వీసులు గ్రీన్ మరియు ఆరంజ్ జోన్స్ పరిధిలో తమ సేవలను తిరిగి ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo