ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పోయిందా? ఇలా చేస్తే ఇట్టే కనిపెట్టొచ్చు..!

Updated on 31-Aug-2021
HIGHLIGHTS

పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ ఈజీగా కనిపెట్టొచ్చు

ఎక్కడున్నా కనిపెట్టొచ్చు

కొట్టేసినా కనిపెట్టొచ్చు

మనకు సంబంధించిన కాంటాక్ట్స్ నుండి మొదలుకొని ఫోటోలు మరియు బ్యాంక్ డేటా అత్యంత సున్నితమైన పర్సనల్ డేటాతో సహ అన్నింటిని స్టోర్ చేసే ఏకైక స్థానంగా స్మార్ట్ ఫోన్ మారిపోయింది. కాబట్టి, స్మార్ట్ ఫోన్ మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన లేదా దాచుకోవాల్సిన వస్తువుగా మారింది.

అటువంటి ఈ స్మార్ట్ ఫోన్ అనుకోకుండా ఎక్కడైనా పోగొట్టుకున్న లేక దొంగిలించబడినా మీరు పడే భాధ వర్ణనాతీతం. అందుకే, అటువంటి సమయంలో మీరు కంగారు పడకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడుందో అతి సులువుగా కొనుగొనేందుకు ఉపయోగపడే మంచి విషయాన్ని ఈరోజు వివరించనున్నాము.

అయితే, Android స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులు అనుకోకుండా తమ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా ఏమిచేయాలో ఇక్కడ చూద్దాం…                             

Android స్మార్ట్‌ఫోన్ కోసం

Find My Device అనేది Android- ఆధారిత పరికరాల కోసం Google అందించే ఒక ఫీచర్. ఇది అనుకోకుండా మర్చిపోయిన లేదా పోగొట్టుకున్న వారి ఫోన్‌లు, టాబ్లెట్ లేదా వేరబుల్స్ వస్తువులను ట్రాక్ చేయడానికి మరియు కనుగొనడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. ప్రతి Android స్మార్ట్‌ఫోన్‌తో ఈ సేవ అందించబడుతుంది మరియు మీరు Google ఖాతాతో సైన్ ఇన్ చేసి ఉంటే, Find My Device ఆటొమ్యాటిగ్గా ప్రారంభించబడుతుంది.

Find My Device సర్వీస్ అనేది మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి, సైలెంట్ మోడ్‌లో కూడా సమీపంలో ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి సౌండ్ ప్లే చేస్తుంది మరియు మీ ప్రైవేట్ డేటాను సురక్షితంగా ఉంచడానికి చివరి సహాయంగా స్మార్ట్ ఫోన్ లేదా డివైజ్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ఒక ఎంపికను అందిస్తుంది. ఒకవేళ మీరు మీ Android ఫోన్‌ను కోల్పోయినట్లయితే, ఫోన్‌ను ట్రాక్ చేయడానికి మరియు దాని ఆచూకీ తెలుసుకోవడానికి ఈ క్రింది దశలు మీకు సహాయపడతాయి.

  • మీ Google ఖాతాతో ల్యాప్‌టాప్ లేదా PC లో Find My Device సర్వీస్ లోకి లాగిన్ అవ్వండి.
  • మీరు ఒకే ఇమెయిల్‌తో చాలా ఫోన్లను నమోదు చేసుకుంటే ఆ ఫోన్ల నుండి మీకు కావలసిన ఫోన్ను ఎంచుకోవడానికి డాష్‌బోర్డ్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • జాబితా నుండి మీరు కనుక్కోవాల్సిన ఫోన్‌ను ఎంచుకోండి.
  • Find My Device మీ ఫోన్ యొక్క లొకేషన్ కనుగొని, మ్యాప్‌లో దాని లొకేషన్ చూపించడానికి ప్రయత్నిస్తుంది.
  • ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడాన్ని నిర్వహిస్తుంది, ఇది మీకు ఎంచుకోవడానికి మూడు ఎంపికలను అందిస్తుంది – సౌండ్ ప్లే, సెక్యూర్ డివైజ్ మరియు ఎరేజ్ డేటా.
  • మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, మీరు సమీపంలో ఉంటే దాన్ని గుర్తించడానికి లేదా ఇతరులను అప్రమత్తం చేయడానికి 5 నిమిషాలు రింగింగ్ ప్రారంభమవుతుంది.
  • అదనంగా, మీరు ఫోన్‌ను లాక్ చేయడం ద్వారా దాన్ని సెక్యూర్ చెయ్యవచ్చు మరియు ఫోన్‌ మరెవరికైనా దొరికితే మెసేజ్ ద్వారా వారికీ తెలియచేయవచ్చు. Google ఖాతా నుండి సైన్-అవుట్ చేసిన తర్వాత కూడా ఫోన్ యొక్క లొకేషన్ మ్యాప్‌లో చూపబడుతుంది.

ఇక చివరి అవకాశంగా, పోగొట్టుకున్న ఫోన్‌ను రక్షించడం చాలా కష్టంగా ఉన్న సందర్భాల్లో, మీ ఫోన్ లో వున్న విలువైన డేటా డిలీట్  చేసే ఎంపిక ద్వారా ఉన్న మొత్తం డేటాను తొలిగించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :