తస్మాత్ జాగ్రత్త ! ఆన్లైన్ ఆర్డర్ క్యాన్సిల్ చేద్దామనుకుంటే 4 లక్షలు దోచేశారు

Updated on 21-Nov-2019
HIGHLIGHTS

ఆన్లైన్లో కొన్ని విషయాల గురించి వెతక్క పోవడమే మంచిది.

భారతదేశంలో ఆన్‌లైన్ మోసం నానాటికి పెరుగుతోంది మరియు ఇప్పుడు, లక్నోలో జరిగిన ఒక కొత్త సంఘటనలో, ఒక వ్యక్తి ఆన్‌ లైన్ మోసానికి గురయ్యాడు. గోమ్టినగర్ కి చందిన వ్యక్తి ఆన్‌ లైన్ ఫుడ్ డెలివరీ అప్లికేషన్ ఉపయోగించి ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆ ఫుడ్ బాగోలేనందున, తన ఆర్డర్‌ ను క్యాన్సిల్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు ఈ మోసం జరిగింది.

ఒక మీడియా నివేదిక ప్రకారం,  సదరు మోసపోయిన వ్యక్త్తి, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఆర్డర్ యొక్క ఆహార నాణ్యత బాగోలేని కరంగా, దాని గురించి కంప్లైంట్ చేయడం కోసం కస్టమర్ సేవ ను సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ బాధితుడు, వెంటనే ఇంటర్నెట్లో కస్టమర్ కేర్ నంబర్ను Search చేసి దానికి కాల్ చేశాడు. అదే అతను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు , ఆ తర్వాత అతను రూ .4 లక్షలు కోల్పోవలసి వచ్చింది.

వాస్తవానికి, అక్కడ ఆన్లైన్లో ఆ సంస్థ పేరున అంటూ కాల్ చేసిన టోల్ ఫ్రీ నంబర్ నకిలీదని తేలింది. టైమ్స్ నౌ  ప్రకారం, ఆ వ్యక్తి ఈ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, ఒక వ్యక్తికి కాల్ వెళ్ళింది. ఈ వ్యక్తి తనను తాను ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ ఫామ్ యొక్క కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, మీ ఆర్డర్ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి, ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తిని ఒక APP ఇన్‌స్టాల్ చేసి తన సేవింగ్స్ బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవ్వమని కోరాడు. అతను, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సూచనలను అనుసరించి, తన బ్యాంక్ ఖాతా వివరాలను యాప్‌లో నమోదు చేశాడు. వెంటనే, అతను తన ఫోన్లో ఒక OTP పాస్వర్డ్ను అందుకున్నాడు.

మీ డబ్బును,  వాపసు పొందడానికి OTP ని ఎంటర్ చేయాలని కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కోరినట్లు, ఆ వ్యక్తి సూచనలను అనుసరించినప్పుడు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ గా పరిచయమైన వ్యక్తి తన ఖాతా నుండి రూ .4 లక్షలను నిమిషాల్లో తీసేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు డౌన్లోడ్ చేసిన యాప్‌,  ఫోన్ నంబర్‌ ను రిమోట్‌గా యాక్సెస్ చేయడానికి అనుమతించింది. అంటే, ఇతని ఫోన్ నుండి అన్ని వివరాలు చేరుకున్న తరువాత, నిందితుడు బ్యాంక్ ఖాతా నుండి రూ .4 లక్షలు విత్తిడ్రా చేయడంలో విజయవంతమయ్యాడు. కాబట్టి, ఆన్లైన్లో కొన్ని విషయాల గురించి వెతక్క పోవడమే మంచిది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :