do you know Digital Ration Card complete benefits
Digital Ration Card గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. డిజిటల్ రేషన్ కార్డు కలిగిన వారు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు సరసమైన ధరలో పొందడానికి మాత్రమే రేషన్ కార్డు ఉపయోగపడుతుందని చాలా మంది కార్డ్ హోల్డర్లు అనుకుంటారు. వాస్తవానికి, డిజిటల్ రేషన్ కార్డ్ అనేది చాలా పనులకు ఉపయోగపడుతుంది. అందుకే, ఈరోజు డిజిటల్ రేషన్ కార్డ్ ఉపయోగాలు మరియు ఈ కార్డు ను ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందామా.
డిజిటల్ రేషన్ కార్డు గురించి సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం మీకు అందించిన రేషన్ కార్డు యొక్క డిజిటల్ వెర్షన్ అని సింపుల్ గా చెప్పవచ్చు. డిజిటల్ రేషన్ కార్డు అనేది మీ ఆధార్ కార్డు తో కచ్చితంగా లింక్ చేయబడి ఉండాలి. అప్పుడే అది డిజిటల్ రేషన్ కార్డుగా చెల్లుబాటు అవుతుంది. ఈ డిజిటల్ రేషన్ కార్డుని మీరు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకుంటే మీ దగ్గరలోని సచివాలయం లేదా సంబంధించిన గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కూడా పొందవచ్చు.
ఇక డిజిటల్ రేషన్ కార్డు యొక్క ముఖ్యమైన ఉపయోగాలు విషయానికి వస్తే అన్నిటికన్నా ముందుగా చెప్పేది నిత్యావసర సరుకులు సరసమైన ధరలు పొందడానికి ప్రధాన మార్గంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వన్ నేషన్ వన్ రేషన్ కారణంగా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం కూడా లభించింది. వలస కూలీల కోసం ఈ ప్రత్యేకమైన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. కేవలం ఇది మాత్రమే కాదు ఇది సాధారణ రేషన్ కార్డు యొక్క డిజిటల్ వెర్షన్ కాబట్టి సాధారణ రేషన్ కార్డు యొక్క అన్ని లాభాలను ఇది అందిస్తుంది.
డిజిటల్ రేషన్ కార్డు కలిగి ఉండటం వలన ప్రభుత్వం అందించే యాప్స్ ద్వారా కార్డ్ హోల్డర్ యొక్క హక్కులు మరియు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే, పైన తెలిపిన విధంగా వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా మీరు ఏ రాష్ట్రం రేషన్ షాప్ నుంచైనా సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఐడెంటిటీ ప్రూఫ్ మరియు మీ అడ్రస్ ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా, డిజిటల్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంటుంది కాబట్టి నకిలీ రేషన్ కార్డు మరియు నకిలీ లబ్ధిదారుల బెడద కూడా తగ్గుతుంది. ఇది కాకుండా విద్య, వైద్య మరియు మరిన్ని LPG వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాల కోసం ఇది ఉపయోగపడుతుంది. డిజిటల్ రేషన్ కార్డు కలిగి ఉండటం ద్వారా చిరునామా వివరాలను ఆన్లైన్లో సులభంగా అప్డేట్ చేసుకోవడం వీలవుతుంది.
Also Read: BSNL రూ.1 రూపాయికే తెచ్చిన 30 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైస్ కార్డు పేరుతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోంది. ఇవి అన్నీ కూడా ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంటాయి. ఈ రేషన్ కార్డు యొక్క వివరాలు చెక్ చేసుకోవడానికి స్పందన పోర్టల్ లేదా EPDS Andhra website ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి ఆన్లైన్లో అప్డేట్ చేయబడతాయి మరియు డౌన్లోడ్ కోసం అందుబాటులోకి వస్తాయి అని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక తెలంగాణ రాష్ట్ర డిజిటల్ రేషన్ కార్డు విషయానికి వస్తే, తెలంగాణలో EPDS Telangana Portal ద్వారా డిజిటల్ రేషన్ కార్డు వివరాలు పొందవచ్చు. దీనికోసం ఆధార్ మరియు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఒకవేళ ప్రోసెస్ మీకు అర్థం కాకుంటే MeeSeva Centers ద్వారా కూడా డిజిటల్ రేషన్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వన్ నేషన్ వన్ రేషన్ పథకం అమలవుతోంది కాబట్టి ఇక్కడ డిజిటల్ రేషన్ కార్డులు కూడా అందుబాటులో ఉంటాయి.
Note: ఈ న్యూస్ లో అందించిన ఇమేజ్ లు కేవలం AI ద్వారా క్రియేట్ చేసిన ఇమేజ్ లు మాత్రమే. నిజమైన డిజిటల్ రేషన్ కార్డు ను పోలి ఉండవని గమనించాలి.