ఆన్లైన్లో ఆధార్ కార్డు ఎలా అప్డేట్ చేయాలో తెలిపితే రూ.30,000 వేలు సంపాదించవచ్చు: ఇంకా మరెన్నో బహుమతులు గెలుచుకోవచ్చు

Updated on 05-Jul-2019
HIGHLIGHTS

మొదటి బహుమతిగా రూ.30,000

రెండవ బహుమతిగా రూ.20,000

మూడవ బహుమతిగా రూ.10,000 రూపాయలను అందచేస్తారు.

UIDAI అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి My Aadhaar Online Contest ద్వారా, ఈ అరుదైన అవకాశం మీకు అందిస్తోంది. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. 

ఇక ఈ కాంటెస్ట్ వివరాల్లోకివెళితే, ఏదైనా ఆధార్ ఆన్లైన్ సర్వీసు ను ఎంచుకొని దాన్ని ఏవిధంగా ఉపయోగించాలో సవివరంగా గ్రాఫికల్/ యానిమేషన్  వీడియోను చిత్రీకరించాలి. అలా మీరు తీసిన వీడియోకు మీ వాయిస్ లేదా మ్యూజిక్ జత చేయాలి. ఆ తరువాత ఈ వీడియోను UIDAI కి షేర్ చేయాలి. UIDAI కి అందిన వీడియోలలో ఉత్తమైన వాటిని ఎన్నుకొని వారికీ రూ.30,000 రూపాయల నగదును వారికీ అందచేస్తారు. అయితే, ఇక్కడ కొన్ని విషయాలను గుర్తుచుకోవాల్సి ఉంటుంది. ఈ విష్యాలను ఈ క్రింద అందించాను.

మొత్తం 15 కేతగిరీలకు వీడియోలను తీసి పంపవచ్చు. ప్రతి కేటగిరిలో కూడా మూడు వీడియోలను విజేతగా ప్రకటిస్తారు. ఈ మూడు వీడియోలలో మొదటి బహుమతిగా రూ.20,000, రెండవ బహుమతిగా రూ.10,000  మరియు మూడవ బహుమతిగా రూ.5,000 రూపాయలను అందచేస్తారు.  అంటే మొత్తం 15 కేటగిరీలలో మొదటి 3 వీడియోలకు బహుమతులు అందుకున్నారు. అంటే, మొత్తంగా 40వీడియోలకు గాను 40 మందికి ఈ అవకాశం దక్కుతుంది.

అదనంగా, మొత్తం విభాగాలలో బెస్ట్ 3 వీడియోలకు గాను ప్రత్యేక బహుమతి కూడా లభిస్తుంది. ఈ విభాగంలో, మొదటి బహుమతిగా రూ.30,000, రెండవ బహుమతిగా రూ.20,000  మరియు మూడవ బహుమతిగా రూ.10,000 రూపాయలను అందచేస్తారు.           

మీరు e మెయిల్ చేసేప్పుడు ఏ క్రింది విషయాలు కచ్చితంగా అందించండి

1. మీ పేరు

2. మీ మొబైల్ నంబర్

3. పుట్టిన తేదీ

4. e మెయిల్ ID

5. పూర్తి చిరునామా

6. మీరు మీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కు మీ ఆధార్  లింక్ చేశారా లేదా అనేది తెలియచేయండి

7. లింక్ చేస్తే 'YES' అని చేయకపోతే 'NO' అని ఎంటర్ చేయండి.

ముఖ్య గమనిక : మీ వీడియో గనుక 10MB కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లయితే గనుక యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్ పంపండి లేదా గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి లింక్ పంపండి లేదా ఫైల్ షేరింగ్ ద్వారా పంపండి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :