Joker Malware: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేయండి…ఉంటే..!

Updated on 23-Nov-2021
HIGHLIGHTS

జోకర్ మాల్వేర్ అనేది చాలా శక్తివంతమైన మాల్వేర్

దాదాపుగా 15 యాప్స్ దీని భారిన పడినట్లు తెలిపారు

మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు

మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే, సైబర్ సెక్యూరిటీ సంస్థ Kaspersky యొక్క విశ్లేషకుడు తత్యాన సిస్కోవా గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న కొన్ని యాప్స్ జోకర్ మాల్వేర్ భారిన పడినట్లు కనుగొన్నారు. జోకర్ మాల్వేర్ అనేది చాలా శక్తివంతమైన మాల్వేర్. వాస్తవానికి,  గూగుల్ దీన్ని పూర్తిగా తొలగించడానికి తగిన చర్యలు కూడా తీసుకుంది. అయితే, తత్యాన సిస్కోవా లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లోకి తిరిగి ప్రవేశించినట్లు, దాదాపుగా 15 యాప్స్ దీని భారిన పడినట్లు తెలిపారు.

గత సంవత్సరం గూగుల్ ప్లే స్టోర్ నుండి అనేకమైన యాప్స్ పైన జోకర్ మాల్వేర్ అటాక్ చేసింది. దీనిభారీ నుండి వినియోగదారులను రక్షించడానికి గూగుల్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోని ఈ మాల్వేర్ సోకిన అన్ని యాప్స్ ను తొలగించింది. అయితే, ఈ మాల్వేర్ మళ్ళి గూగుల్ ప్లే స్టోర్ లోకి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది.

అసలు ఏమిటి ఈ జోకర్ మాల్వేర్?

జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.

లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ భారిన పడిన యాప్స్

Easy PDF Scanner

Now QRCode Scan

Super-Click VPN

Volume Booster Louder Sound Equalizer

Battery Charging Animation Bubble Effects

Smart TV Remote

Volume Boosting Hearing Aid

Flashlight Flash Alert on Call

Halloween Coloring

Classic Emoji Keyboard

Super Hero-Effect

Dazzling Keyboard

Emoji One Keyboard

Battery Charging Animation Wallpaper

Blender Photo Editor-Easy Photo Background Editor                  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :