Google నుండి Covid-19 టెస్టింగ్స్ సెంటర్స్ పూర్తి సమాచారం, ఇలా చేస్తే చిటికెలో తెలుసుకోవచ్చు.

HIGHLIGHTS

Google తన కోవిడ్ -19 సంబంధిత శోధనలో భాగంగా కొత్త టెస్టింగ్ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది.

Google Search ‌లో వినియోగదారులు కోవిడ్ -19 గురించి సమాచారం పొందాలనుకుంటే, డెడికేటెడ్ కోవిడ్ -19 విభాగం టెస్టింగ్ ట్యాబ్‌ను చూపిస్తుంది.

ఈ టాబ్ వినియోగదారుకు దగ్గరగా ఉన్న టెస్టింగ్ సెంటర్స్ గురించి సమాచారాన్ని ఇస్తుంది.

Google నుండి Covid-19 టెస్టింగ్స్ సెంటర్స్ పూర్తి సమాచారం, ఇలా చేస్తే చిటికెలో తెలుసుకోవచ్చు.

ఇటీవలే గూగుల్ కొత్త కోవిడ్ -19 సంబంధిత కొత్త ఫీచర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసందే. అయితే, ఇప్పుడు ఈ ఫీచర్లను కొన్ని దేశాలలో ప్రారంభించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ కంపెనీ ఈ ఫీచర్‌ను ఇండియాలో ప్రకటించనుంది. Covid -19 కేంద్రాలను కనుగొనడంలో ప్రజలకు సహాయపడటానికి టెక్ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు MyGov ‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google తన కోవిడ్ -19 సంబంధిత శోధనలో భాగంగా కొత్త టెస్టింగ్ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది. Google Search ‌లో వినియోగదారులు కోవిడ్ -19 గురించి సమాచారం పొందాలనుకుంటే, డెడికేటెడ్ కోవిడ్ -19 విభాగం టెస్టింగ్ ట్యాబ్‌ను చూపిస్తుంది. ఈ టాబ్ వినియోగదారుకు దగ్గరగా ఉన్న టెస్టింగ్ సెంటర్స్ గురించి సమాచారాన్ని ఇస్తుంది. లొకేషన్ కాకుండా, ఇది కేంద్రాల సేవల గురించి ప్రధాన సమాచారం మరియు సూచనలను ఇస్తుంది.

టెస్టింగ్ తీసుకోవడానికి ముందు జాతీయ లేదా రాష్ట్ర హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం, ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం (రిఫెరల్ అవసరం), టెస్టింగ్ పరిమితులు (పరీక్షలు కొన్ని రోగులకు మాత్రమే పరిమితం) సహా ప్రభుత్వ తప్పనిసరి అవసరాలు ఏమిటో కూడా జాబితా చూపిస్తుంది. అంతేకాదు, టెస్టింగ్ ల్యాబ్స్ ప్రభుత్వనివా లేదా ప్రైవేటు సంస్థలవా అనే సమాచారం కూడా ఇవ్వబడుతుంది.

వినియోగదారు "కోవిడ్ 19 టెస్ట్" లేదా "కరోనావైరస్ టెస్టింగ్" వంటి కీలకపదాలను నమోదు చేసినప్పుడు, గూగుల్ మ్యాప్స్ సమీప పరీక్ష కేంద్రాలను కూడా చూపుతుంది. ప్రభుత్వం ఆదేశించిన అవసరాల కోసం Google Search లింక్‌తో ఈ జాబితా కలపబడుతుంది. 'మరింత తెలుసుకోండి' లింక్‌పై నొక్కడం ద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) నుండి మరింత సమాచారం లభిస్తుంది.

సంస్థ ప్రకారం, ఈ Search ప్రస్తుతం 300 కి పైగా నగరాల్లో విస్తరించి వుంది మరియు మ్యాప్స్‌లో జాబితా చేయబడిన 700 కి పైగా పరీక్షా కేంద్రాలను కలిగి ఉంది. ICMR ‌తో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని, దేశవ్యాప్తంగా మరిన్ని కేంద్రాలను ఇందులో చేర్చుతామని Google పేర్కొంది. ఈ కొత్త సర్వీస్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ మరియు గుజరాతీ భాషలలో అందుబాటులో ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo